»   » మిస్టర్ ఫర్ ఫెక్ట్ లాగే ‘రెబల్’ ప్రభాస్ కొత్త లుక్

మిస్టర్ ఫర్ ఫెక్ట్ లాగే ‘రెబల్’ ప్రభాస్ కొత్త లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'రెబల్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో హీరో, విలన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యులు ఈ నెల 22 వరకు జరుగుతుందనీ, తిరిగి ఆగష్టు 10 నుంచి సెప్టెంబర్ 5 వరకు బ్యాంకాక్ లో భారీ షెడ్యులు జరుగుతుందని నిర్మాతలు చెబుతున్నారు. తిరిగి అదే నెల 10 నుంచి పూర్తయ్యే వరకు చివరి షెడ్యులు జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు.

మిస్టర్ పెర్ఫెక్ట్ లానే ఇందులో కూడా తన లుక్ కొత్తగా ఉంటుందని హీరో ప్రభాస్ చెప్పాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే స్టైలిష్‌గా, మాస్‌గా వుంటుందీ చిత్రం. అనుష్క, దీక్షాసేత్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రామ్ ప్రసాద్ కెమెరామెన్ గాను, మార్థాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేయనున్నారు. దర్శకుడు లారెన్స్ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రభాస్‌లాంటి క్రేజీ హీరోతో ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్నిఅనుకున్న ప్రకారం షెడ్యూల్స్ పూర్తి చేయగలిగితే 'రెబల్" డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామంటున్నారు దర్శక, నిర్మాతలు...

English summary
Prabhas Starring Rebel directed by Raghava Lawrence to shoot he next schedule in Bangkok. The Bangkok schedule will start from August 10th and will end on 4th september. The current schedule in Aluminum factory will continue till 22nd July. Anushka and Deeksha seth are playing the female leads in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu