twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్.. డార్లింగ్ రెమ్యూనరేషన్.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే

    |

    బాహుబలి చిత్రాలకు ముందు ప్రభాస్ వేరు.. ఇప్పుడున్న ప్రభాస్ వేరు. రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన డార్లింగ్‌ను దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ అశేష అభిమానులను దగ్గర చేసింది బాహుబలి. బాహుబలితో ఇండియన్ స్టార్‌గా మారిన ప్రభాస్.. సాహో చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దాడి చేశాడు. కేవలం ప్రభాస్ ఇమేజ్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 350కోట్లు కొల్లగొట్టినట్టు టాక్. తాజాగా ప్రభాస్ తదుపరి చిత్రం గురించి మేకర్స్ ఓ అప్‌డేట్ ఇచ్చారు.

     ప్రస్తుతం రాధాకృష్ణతో..

    ప్రస్తుతం రాధాకృష్ణతో..

    జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ప్రభాస్ ఓ పీరియాడిక్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అప్పట్లో జాన్ అనే టైటిల్ అని ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ డియర్, రాధే శ్యామ్.. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    వాయిదాలతో ఇబ్బంది..

    వాయిదాలతో ఇబ్బంది..

    ప్రభాస్-పూజా హెగ్డే కాంబోలో వస్తోన్న ఈ చిత్రం వాయిదాలతో సతమతమవుతోంది. అనుకున్న టైమ్ ప్రకారం షెడ్యూల్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఆలస్యమవుతూనే ఉంది. ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరపుకుంటుండగా.. త్వరలోనే విదేశాలకు వెళ్లేట్టు కనిపిస్తోంది.

    వైజయంతీ మూవీస్‌తో..

    వైజయంతీ మూవీస్‌తో..

    వైజయంతీ మూవీస్‌తో ప్రభాస్.. అది కూడా నాగ్ అశ్విన్ లాంటి యంగ్ డైరెక్టర్‌తో అని అనౌన్స్‌మెంట్ రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. మహానటి తరువాత మరో ప్రాజెక్ట్ చేయని నాగ్ అశ్విన్.. డార్లింగ్‌తో సినిమా అనే సరికి అందరి అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి.

     ప్యాన్ వరల్డ్..

    ప్యాన్ వరల్డ్..

    దీనికి తోడు నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ ఎవ్వరికీ నిద్ర పట్టకుండా చేస్తోంది. అందరూ ఈ సినిమా ప్యాన్ ఇండియానా? అని అడుగుతున్నారని, ప్యాన్ ఇండియా ఎప్పుడో దాటేశారని, ఇది ప్యాన్ వరల్డ్ అంటూ కామెంట్ చేశాడు. ఓ దర్శకుడే ఇలా భరోసా ఇస్తే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి.

    ప్రభాస్ రెమ్యూనరేషన్..

    ప్రభాస్ రెమ్యూనరేషన్..

    బాహుబలి, సాహో తరువాత ప్రభాస్ రేంజ్ మారడంతో రెమ్యూనరేషన్‌లో భారీ తేడాలు వచ్చాయి. బాహుబలి చిత్రానికి ఎంత తీసుకున్న తక్కువే అవుతుంది.. ఎందుకుంటే ఆ మూవీ కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించాడు. సాహో తన స్వంత బ్యానర్ కాబట్టి రెమ్యూనరేషన్ ఊసే ఉండదు. ఇక నాగ్ అశ్విన్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఎంత మొత్తంలో చార్జ్ చేస్తున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

    దాదాపు 70కోట్లు..

    దాదాపు 70కోట్లు..

    వైజయంతీ మూవీస్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రభాస్ రెమ్యూనరేషన్‌గా దాదాపు 70 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంకా లాభాల్లోనూ షేర్ ఉందట. ఈ లెక్కన దాదాపు వంద కోట్ల దాటుతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే ప్రభాస్ పెట్టిన ఆ కండీషన్‌కు మాత్రం తలొగ్గాల్సిందేనట. షూటింగ్ మొదలు పెట్టిన తరువాత.. ఏడాదికి సినిమా కచ్చితంగా పూర్తి చేయాలని లేకపోతే అదనంగా చార్జ్ చేస్తానని తేల్చి చెప్పాడట. మరి ఏం జరుగుతోందో చూడాలి.

    English summary
    Prabhas Remuneration For Nag Ashwin Project. Prbhas Remuneration For vyjayanthi Movies Project Issue Goes Viral. Buzz Is That He May Get More Than Rs 100 Crores For That Project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X