For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas ఫ్యాన్స్‌కు పండగ లాంటి న్యూస్: ‘రాధే శ్యామ్’ ఫస్ట్ కాపీ లీక్.. అందుకే సీక్రెట్‌గా ఉంచారట!

  |

  కెరీర్ ఆరంభం నుంచి ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాల్లోనే నటించి.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత నుంచి తన పంథాను మార్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆ చిత్రంతో యూనివర్శల్ స్టార్ అయిన అతడు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఒకటి పట్టాలపై ఉండగానే.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ తొలిసారి ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులు మీకోసం!

  హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

  తొలిసారి అలాంటి సినిమాలో ప్రభాస్

  తొలిసారి అలాంటి సినిమాలో ప్రభాస్

  వరుసగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోన్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో ‘రాధే శ్యామ్' చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నాడు.

  వరుస ఆటంకాలు.. చాలా టైమ్ వేస్ట్

  వరుస ఆటంకాలు.. చాలా టైమ్ వేస్ట్

  గతంలో స్పీడుగా సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి' నుంచి వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే ‘రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయినా.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పలుమార్లు ఆటంకం ఏర్పడడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అని చెప్పుచ్చు.

   భారీగా అంచనాలు... బిజినెస్‌ కూడా

  భారీగా అంచనాలు... బిజినెస్‌ కూడా

  ‘రాధే శ్యామ్' చిత్రీకరణ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున విడుదల చేశారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

   ప్రభాస్ బిజీ.. బ్యాలెన్స్ వర్క్ అలానే

  ప్రభాస్ బిజీ.. బ్యాలెన్స్ వర్క్ అలానే

  ‘రాధే శ్యామ్' మూవీలో కొన్ని బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. కృష్ణంరాజు, పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సాంగ్ షూటింగ్ కూడా మిగిలిపోయింది. దాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత పూజా హెగ్డే కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

  ఈ సినిమా రీషూట్ అంటూ ప్రచారం

  ఈ సినిమా రీషూట్ అంటూ ప్రచారం

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్' మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి ఇటీవల ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అయింది. దీని ప్రకారం.. ఈ మూవీకి రీషూట్ అవసరం వచ్చిందని.. దీనికి చాలా కాలం సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అంటే.. దీని వల్ల సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న టాక్ గట్టిగా వినిపించింది.

   ‘రాధే శ్యామ్' ఫస్ట్ కాపీ వివరాలు లీక్

  ‘రాధే శ్యామ్' ఫస్ట్ కాపీ వివరాలు లీక్

  ‘రాధే శ్యామ్' రీషూట్.. రిలీజ్ డేట్ వాయిదా అని ఎన్నో ప్రచారాలు జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందట. మరో ఎనిమిది రోజుల షూటింగ్ జరిగితే.. సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని తెలిసింది. దీంతో త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉందట.

  #SSMBRampageOnMAY31st : Mahesh Babu ఫ్యాన్స్ కి పండగే..!! || Filmibeat Telugu
  అందుకే ఆ మేటర్ సీక్రెట్‌గా ఉంచారట

  అందుకే ఆ మేటర్ సీక్రెట్‌గా ఉంచారట

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రాధే శ్యామ్' ప్రచార కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయట. అయితే, దీని కంటే ముందు సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు కొన్ని ప్లాన్లను అమలు చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలిసింది. అందుకే ఈ వివరాలన్నింటినీ సీక్రెట్‌గా ఉంచారని టాక్. కానీ, ఈ విషయాలు మాత్రం ముందే బయటకు వచ్చాయి.

  English summary
  Young Rebel Star Prabhas upcoming film is Radhe Shyam. Apart from eight days shoot, this movie entire shooting and post production completed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X