Don't Miss!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్రభాస్ ‘సాహో’ మూవీ టీజర్ లీక్.. షాక్‌లో డైరెక్టర్ సుజిత్ రెడ్డి?
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో టీజర్ రిలీజ్‌కు ముందే సోషల్ మీడియా, యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతున్నది. వాస్తవానికి ఈ టీజర్ ఈ నెల 28న బాహుబలి సినిమాతోపాటు ప్రేక్షకులకు అందించాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. అయితే వారి అభిష్టానికి భిన్నంగా బుధవారమే ఈ టీజర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ టీజర్ నిజమైనదేనా? లేక మరోటా అనే విషయం సందిగ్ధత నెలకొన్నది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో 19వదనే సంగతి తెలిసిందే.

తలకు గాయమై..
సాహో టీజర్ భావిస్తున్న వీడియోలో తలకు గాయమై ప్రభాస్ కూర్చొని ఉంటాడు. విజ్వువల్ కనిపిస్తుండగానే వాయిస్ ఓవర్‌లో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి. ‘వాడిపైన ఉన్న రక్తం చూస్తే తెలుస్తుంది. వాడిని చచ్చేంత కొట్టారని అని ఓ వ్యక్తి అంటే మరో వ్యక్తి వాడిపై ఉన్న రక్తం వాడిది కాదు. మనవాళ్లది అని అంటాడు. ప్రభాస్ ఇట్స్ షో టైమ్ అని అనడంతో టీజర్ ముగుస్తుంది.

టెక్నికల్‌గా టీజర్ సూపర్
ఈ టీజర్ మాత్రం టెక్నికల్‌గా సూపర్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కొన్ని దృశ్యాలను జూమ్ అవుట్ చేస్తూ సీన్ ఎలాబ్రేట్ చేయగా అది ప్రభాస్ కన్ను.. ఆ తర్వాత తల అని తేల్తుంది. ఆ సీన్ షూట్ చేసిన విధానం సినిమా టేకింగ్ అద్దం పట్టేలా ఉందనే అభిమానులు చెప్పుకొంటున్నారు.

ఏడాది క్రితం గ్రీన్ సిగ్నల్
ఏడాది క్రితం సుజిత్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాహుబలి2 సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి ఈ సినిమా అంతకుముందే ప్రారంభమైందని, ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరుచాలని దర్శకుడు సుజిత్ నిర్ణయించినట్టు సమాచారం.

23న టీజర్, ఫస్ట్‌లుక్
సుజిత్ డైరెక్షన్‌లో వచ్చే ఈ చిత్రం నాలుగు భాషల్లో రూపొందుతున్నది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభాస్ 19వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌ను, పోస్టర్‌ను ఏప్రిల్ 23న ప్రకటిస్తాం. బాహుబలి2 సినిమాతోపాటు నాలుగు భాషల్లో టీజర్‌ను విడుదల చేస్తాం అని దర్శకుడు సుజిత్ తెలిపాడు.

రెండేళ్లుగా వెయిటింగ్..
ప్రభాస్‌తో సినిమా కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. టీజర్ కోసం పనిచేయడం ఒక సినిమా కోసం కంటే ఎక్కువ శ్రమించినంత పనవుతున్నది. టీజర్‌కు ముంబైలో తుది మెరుగులు దిద్దుతున్నాం అని సుజిత్ రెడ్డి వెల్లడించారు. టీజర్ అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతుందనే ధీమాను సుజిత్ ఇటీవల వ్యక్తం చేశాడు.

150 కోట్ల బడ్జెట్
ప్రభాస్ 19వ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం స్టంట్లు, యాక్షన్ సీన్ల కోసం ఖర్చుపెడుతున్నాం. ఈ సినిమాలో అనేక కమర్షియల్ హంగులు ఉన్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కొత్త పాయింట్ ఈ చిత్రంలో ఉన్నది అని సుజిత్ తెలిపాడు.

ఒక్క యాక్షన్ సీన్‌కే 35 కోట్లు
ఈ సినిమాలో కీలక సన్నివేశమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా బడ్జెట్‌పై ఇంకా నిర్ధారణకు రాలేదు. ఫైట్స్‌ను నభూతో నభవిష్యత్ అనే రీతిలో చిత్రీకరిస్తామని ముందే చెప్పాను.

జేమ్స్‌బాండ్ సినిమాలా..
ఈ చిత్రం స్టైలిష్‌గా ఉండటమే కాదు.. జేమ్స్ బాండ్ సినిమాను తలదన్నేలా ఉంటుంది. ఈ సినిమా కథలో ఎమోషన్స్, డ్రామా అని అంశాలు ఉంటాయి. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని కచ్చితంగా చెప్తున్నాను అని సుజిత్ తెలిపాడు.

ఫైట్స్ కోసం కెన్నీ బేట్స్
యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌ను రంగంలోకి దించాం. కెన్నీ అద్భుతంగా యాక్షన్ సీన్లను రూపొందిస్తున్నాడు. ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ కోసం యూరప్‌లోని కొన్ని ప్రదేశాలను, అబుదాబీలోని కొన్ని లోకేషన్లను ఇప్పటికే ఖారారు చేశాం. మే చివరికల్లా యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తాం అని సుజిత్ చెప్పుకొచ్చారు.

సాబుసిరిల్, శంకర్ ఎహసాన్, లాయ్..
అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్న ప్రభాస్ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాదీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాడు. జాతీయ స్థాయికి, బాలీవుడ్‌కు తగినట్టు సంగీతం ఉండాలనే ఉద్దేశంతో సంగీత త్రయాన్ని రంగంలోకి దించాం. గతంలో దక్షిణాది చిత్రాలకు కూడా వారు సంగీతం అందించారు అని సుజిత్ పేర్కొన్నారు.