»   » ప్రభాస్ తో ఇది జరిగే పనేనా?

ప్రభాస్ తో ఇది జరిగే పనేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తణికెళ్ల భరణికి ఎప్పటినుంచో తాను ముచ్చటపడి స్క్రిప్టు చేసుకున్న భక్త కన్నప్ప చిత్రం పట్టాలు ఎక్కించాలని కోరిక. అయితే హీరోలు మారుతున్నారు..ప్రొడక్షన్ కంపెనీలు మారుతున్నాయి కానీ సినిమా మాత్రం పట్టాలు ఎక్కటం లేదు. కానీ ఇప్పుడు దానికి స్టార్ హీరో దొరికాడని అంటున్నారు. ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్.

Prabhas in Tanikella Bharani Direction?

కరెక్టుగా సంవత్సరం క్రితం ..మంచు విష్ణు హీరోగా ఈ చిత్రం పట్టాలు ఎక్కుతుందని ఎనౌన్సమెంట్ వచ్చింది. ఆయన కూడా మొత్తం స్క్రిప్టు లాక్ చేసుకుని ఆ క్షణాలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విష్ణు తాను ఇప్పుడున్న పరిస్దితుల్లో చిత్రం చేయలేనని, కొంతకాలం ఆగాలని అన్నారు. దాంతో ఆయన డీలా పడ్డారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం...ప్రభాస్ తో చేయటానికి కృష్ణంరాజు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తను బాపు దర్శకత్వంలో అప్పట్లో చేసిన ఈ చిత్రం రీమేక్ గా ప్రభాస్ చేయాలనుకున్నారు. అయితే భరణి స్క్రిప్టు నచ్చితే ఆయన ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి భరిణి నమ్ముకున్న శివుడు..ఈ శివుడు (బాహుబలి ప్రభాస్ )ని తీసుకువస్తాడో లేదో చూడాలి.

English summary
It is learnt that Bharani is making efforts to convince Krishnam Raju with Bhakta Kannappa story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu