»   »  'కంచె' భామకు కలిసొచ్చింది... మహేష్‌తో ఛాన్స్

'కంచె' భామకు కలిసొచ్చింది... మహేష్‌తో ఛాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్న విజయదశమి కానుకగా క్రిష్ దర్సకత్వంలో రూపొందిన 'కంచె' లో హీరోయిన్ గా చేసిన భామ ప్రగ్యా జైశ్వాల్‌ ఛాన్స్‌ కొట్టిందని తెలుస్తోంది. ఈసారి ఆమె మహేష్‌బాబుతో కలిసి ఆడిపాడబోతోందని అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'మిర్చిలాంటి కుర్రాడు' అనే సినిమాతోనే ప్రగ్యా తెలుగు తెరకు పరిచయమైనా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కంచె'తోనే తొలి విజయాన్ని చేజిక్కించుకొంది. సీత పాత్రలో ప్రగ్యా అభినయం కూడా ఆకట్టుకుంది. అందుకే ఆమెపై పరిశ్రమ దృష్టిపెట్టింది. పలు కొత్త చిత్రాలకోసం ఇటీవల ప్రగ్యా పలు ఆడిషన్లు చేసిందట.

మహేష్‌బాబుతో కలిసి నటించే అవకాశం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మహేష్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. వచ్చే యేడాది ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అందులో హీరోయిన్ పాత్రలకోసం శ్రుతిహాసన్‌, అలియాభట్‌లాంటి భామలతో పాటు ప్రగ్యాజైశ్వాల్‌ పేరు కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది.

 Pragya Jaiswal is going to romance with Mahesh Babu

ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్న దర్శకుడు మహేష్ తన తదుపరి చిత్రానికి రంగం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన తదుపరి చిత్రాన్ని దర్శకుడు మురగదాస్ తో చేయనున్నారు. ఈ మేరకు లాంచింగ్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రియల్ 12 , 2016న లాంచ్ చేయటానికి తేదీని ఖరారు చేసారు. చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా మహేష్ ..శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కంటిన్యూగా ..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నాడు. జనవరికు ఆ చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి రేసులో ఉండే ప్లానింగ్ లో ఉన్నాడు. దాంతో మహేష్ సినిమాల మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది.

మరో ప్రక్క బ్రహ్మోత్సవం అనంతరం కూడా ప్రాజెక్టులు వరస పెట్టి సైన్ చేసాసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఎ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో మరో చిత్రం గ్రీన్ సిగ్న ల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు ఒకే సారి ప్రారంభమవుతాయి. వీటిన్నటి తర్వాత రాజమౌళి తో చేసే ప్రాజెక్టుని మెటీరియల్ చేసే అవకాసం ఉంది.

English summary
Pragya Jaiswal is going to romance with Mahesh Babu in A R Murugadoss movie. Pragya Jaiswal is enjoying her success in the recently released movie “Kanche” directed by Krish in which the leading role was done by Mega Hero Varun Tej.
Please Wait while comments are loading...