»   » అనుష్క లేకపోతే సినిమా చెయ్యనంటున్న డైరక్టర్

అనుష్క లేకపోతే సినిమా చెయ్యనంటున్న డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్కకి బాలీవుడ్ ఎంట్రీకి టైమ్ వచ్చేసినట్లుంది. సూర్య సూపర్ హిట్ చిత్రం యముడు (సింగం డబ్బింగ్) ని హిందీలోకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గోల్ మాల్ టైటిల్ తో సీక్వెల్స్ తీసి హిట్టు కొట్టిన రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని హిందీలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని హిందిలో నిర్మిస్తున్నారు. వీరే తమిళంలో కో ప్రొడ్యూస్ చేసారు. ఇక అజయ్ దేవగన్ ని హీరోగా తీసుకున్నారు. అయితే హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అన్న విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారు. మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కరీనా కపూర్ ని తీసుకుందామని నిర్మాతలు పట్టుపడుతున్నారు.

అయితే దర్శకుడు మాత్రం యముడులో చేసిన అనుష్కనే తీసుకుందామని పట్టుపడుతున్నట్లు సమాచారం. అలాగే ఆమె లేకపోతే సినిమా చెయ్యననే దాకా కూడా వెళ్ళాడని బాలీవుడ్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రోహిత్ శెట్టి...నేను నా తదుపరి చిత్రాన్ని తమిళంలో హిట్టయిన సింగం రీమేక్ గా చేస్తున్నాను. అజయ్ దేవగన్ ని హీరోగా అనుకున్నాం. మిగతా ఆర్టిస్టులు ఎవరన్నది త్వరలోనే ఫైనలైజ్ కానుంది అన్నారు. అలాగే విలన్ గా ఫ్రకాష్ రాజ్ నే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu