»   »  'గోవిందుడు... ' లో చిరంజీవి భారీ మార్పులు

'గోవిందుడు... ' లో చిరంజీవి భారీ మార్పులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మార్పు కొత్తగా వచ్చింది. ఇంతకు ముందు ఈ పాత్రకు గానూ రాజ్ కిరణ్ ని అనుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ తీసుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు కి కారణం చిరంజీవి అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

తన కుమారుడు తాజా చిత్రంపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ మార్పుతో శ్రీకారం చుట్టాడని అంటున్నారు. అంతేకాక కథలో సైతం కొన్ని మార్పులు చేయబోతున్నారని చెప్తున్నారు. గతంలోనూ నాయక్,రచ్చ, ఎవడు చిత్రాల విషయంలో చిరంజీవి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని, అవి విజయం సాధించటంతో ఈ సారి కూడా ఈ సినిమాని పూర్తిగా పర్యవేక్షించనున్నారని సమాచారం. ఈ మేరకు చేసిన సూచనలలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఒకటని చెప్పుకుంటున్నారు.

Prakash Raj as Ram Charan Grandfather in Govindudu Andarivadu

''సినిమాలో ప్రకాష్‌రాజ్‌ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. తొలుత ఈ పాత్ర కోసం తమిళనటుడు రాజ్‌కిరణ్‌ను ఎంపిక చేశాం. అయితే ఈ పాత్రకు ప్రకాష్‌రాజ్‌ అయితే బాగుంటారని ఆయన్ని తీసుకున్నాం. రామ్‌చరణ్‌కు అనారోగ్యం వల్ల సినిమాను వాయిదా వేశాం. త్వరలో షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది'' అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్‌ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. . ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు.

నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్‌, రాజ్‌కిరణ్‌, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


English summary
Prakash Raj is now roped to play a pivotal role in Ram Charan starrer 'Govindudu Andari Vaadele'. In fact, Rajkiran was approached for Charan’s grandfather role, however the role is now offered to Prakash Raj. The versatile actor will join the shoot in next schedule beginning soon in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu