»   » ప్రకాష్ రాజ్ రెండో పెళ్లికి రంగం సిద్దం

ప్రకాష్ రాజ్ రెండో పెళ్లికి రంగం సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నవంబర్ లో భార్య లలితా కుమారితో విడాకులు పొందిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో రెండో పెళ్ళి చేసుకోనున్నాడు. ఈ సారి వరించబోయేది బాలీవుడ్ కి చెందిన స్టార్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను అని తెలుస్తోంది. విడాకులు పొందకముందు నించీ ఇద్దరి మద్యా గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ జరుగుతోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే అప్పట్లో ప్రకాష్ రాజ్ విడాకుల ప్రయత్నంలో ఉండటంతో ఈ విషయాలు బయిటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. విడాకుల వ్యవహారం పరిష్కారం కావడంతో ఇద్దరూ పెళ్లి ద్వారా ఒకటయ్యే అవకాసం ఉంది. పోనీ ప్రస్తుతం ప్రియదర్శన్ చిత్రంతో పాటు, సంజయ్ లీలా బన్సాలీ 'గుజారిష్' చిత్రంలోని కొన్ని పాటలకు ఆమె కొరియోగ్రఫీ అందిస్తోంది. సల్మాన్ ఖాన్'వాంటెడ్' చిత్రం ద్వారా ప్రకాష్ రాజ్ కు హిందీలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రకాష్ రాజ్ వివాహం ఈ ఏడాది మధ్యలో జరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu