twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీను వైట్ల పగ చల్లారలేదు...వదలడట

    By Srikanya
    |

    హైదరాబాద్ : నటుడు ప్రకాష్‌రాజ్‌, 'ఆగడు' చిత్ర సహాయ దర్శకుల మధ్య నెలకొన్న వివాదం ముగిసిందని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. అయితే దర్శకుల మండిలి ముఖ్యంగా శ్రీను వైట్ల మాత్రం ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా ఉన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు ఆయన తెలుగులో ప్రకాష్ రాజ్ కు ఒక్క పాత్ర కూడా రాకుండా చేయాలని తన మిత్రులు, సన్నిహితుల అయిన దర్శకులతో కలిసి నిర్ణయిం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. తమ స్క్రిప్టులలో తాము ప్రకాష్ రాజ్ కు పాత్ర రాయకుండా ఆయన మీద అప్రకటిత నిషేధం విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

    ప్రకాష్‌రాజ్‌ అకారణంగా తనను దూషించారంటూ 'ఆగడు' చిత్ర సహాయ దర్శకుడు ఇదివరకు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని దర్శకుల సంఘం కోరింది. దీనిపై ప్రకాష్‌రాజ్‌ మీడియా ముందుకొచ్చి తన వాదన కూడా వినిపించారు. శుక్రవారం ఎన్వీ ప్రసాద్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రకాష్‌రాజ్‌తో సహాయ దర్శకునికి క్షమాపణలు చెప్పించినట్టు సమాచారం. సినిమా కోసం తీసుకొన్న పారితోషికాన్ని కూడా వెనక్కి ఇవ్వడానికి ఆయన అంగీకరించినట్టు తెలిసింది.

    Prakash Raj Tendered Apology to Sreenu Vytla

    దీంతో పాటు ఆ రోజు సినిమా చిత్రీకరణకి అంతరాయం ఏర్పడినందుకుగానూ నిర్మాతకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రకాష్‌రాజ్‌ను విచారణ కమిటీ కోరింది. ఈ వివాదం గురించి ఎన్వీ ప్రసాద్‌ విలేకర్లతో మాట్లాడుతూ ''సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాం. ప్రకాష్‌రాజ్‌పై ఎలాంటి నిషేధం విధించడం లేదు. ఇకపై ఇలాంటి అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దని ఇరువర్గాలకు చెప్పాం. సెట్‌లో ఏం జరిగినా విషయం మీడియా వరకు వెళ్లకూడదని చిత్రబృందానికి సలహా ఇచ్చాం'' అన్నారు.

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ''ఆగడు' సినిమా కోసం నేను మొదటి రోజు సెట్‌లో చేయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తి చేశాను. నాకూ, దర్శకుడికీ మధ్య సృజనాత్మకతకి సంబంధించిన భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో నన్ను కాదనుకొని వేరొక నటుడిని తీసుకొన్నారు. వేరే నటుడిని ఎంచుకొనే హక్కు వారికి ఉంటుంది. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా, ఆ సంఘటనను వక్రీకరించి నాపై దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశారు అన్నారు.

    English summary
    The issue between actor Prakash Raj and director Srinu Vaitla, who had creative differences, has been resolved by TFDA and TFPA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X