»   » మరో మెగా హీరో సరసన ప్రణీత ...

మరో మెగా హీరో సరసన ప్రణీత ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిద్దార్ధతో బావ చిత్రంతో పరిచయమైన ప్రణీత గుర్తుండే ఉంటుంది. ప్రణీత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తోంది. దాంతో ఆమెకు మరో మెగా హీరో రామ్ చరణ్ చిత్రం నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం కోసం ఆమెను అడిగినట్లు సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రారంభం కానుంది. బండ్లగణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేథరిన్ థెరీసా ఈ చిత్రానికి హీరోయిన్ గా బుక్ చేసారు. ప్రణీత ని సెకండ్ హీరోయిన్ గా బుక్ చేసే అవకాసం ఉందని సమాచారం.

ఈ చిత్రంలో కథ ..పూర్తిగా బ్రదర్ సెంటిమెంట్ మీద బేస్ చేసుకుని నడుస్తుందని సమాచారం. సెంటిమెంట్,యాక్షన్ కలిసి ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ..రామ్ చరణ్ తో ఓ సెన్సేషనల్ మూవి తియ్యాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. కొరటాల శివ అద్బుతమైన కథ చెప్పారు. హై టెక్నికల్ వేల్యూస్ తో నిర్మించే ఈ చిత్రం మా బేనర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు.


మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

English summary

 Ram Charan is starring under the direction of ‘Mirchi’ fame Koratala Siva.The film will be going to sets from August 5th.Bandla Ganesh is producing the film for which Catherine Tresa is finalised as one hero-ine. Plans are on to cast Pranitha as second hero-ine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu