KGF3 కి అడ్డుపడుతున్న ఎన్టీఆర్.. టెర్రిఫిక్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రశాంత్ నీల్ సీక్వెల్.. ఎప్పుడు ప్రారంభమంటే?
KGF Chapter 2 భారతీయ సినిమా పరిశ్రమ ప్రతిష్టను పెంచేలా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. అయితే ఈ సినిమా దేశీయ సినిమా దిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే కేజీఎఫ్2 సినిమా అందించిన ఉత్సాహంతో ప్రేక్షకులు kGF3 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్3 గురించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

KGF3 గురించి ప్రశాంత్ నీల్
దేశవ్యాప్తంగా నిర్వహించిన KGF Chapter 2 సినిమా ప్రమోషన్‌లో యష్ గానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ.. కేజీఎఫ్3 చిత్రం గురించి పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. KGF3 గురించి మాట్లాడినా గానీ.. దాని గురించి దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఫోకస్ అంతా కేజీఎఫ్2 మాత్రమే ఉండటంతో టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ఇష్టపడలేదనే విషయం ప్రశాంత్ నీల్ మాటల్లో స్పష్టమైంది.

KGF3 ఎప్పుడు ఉంటుందంటే?
అయితే బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ మీటింగ్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ నీల్ సమాధానం ఇస్తూ.. KGF3 ఉంటుంది. కానీ ఇప్పుడు కాదు. మరో ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ తీస్తానని ప్రశ్నను ప్రశాంత్ నీల్ దాటవేసేందుకు ప్రయత్నించారు.

సలార్ ప్రాజెక్టుపై దృష్టి
అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం బిజీగా పలు ప్రాజెక్టుల్లో బిజీగా మారారు. కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ పూర్తిస్థాయిలో ప్రభాస్ నటించే సలార్ సినిమాపై దృష్టిపెట్టారు. అయితే సలార్ సినిమా తర్వాత దానికి సీక్వెల్ గురించి ఇప్పుడే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సలార్ ద్వారా మరోసారి ప్యాన్ వరల్డ్ లెవెల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

NTR31 ప్రాజెక్టుతో ఎన్టీఆర్ బిజీ
కేజీఎఫ్2, సలార్ తర్వాత ఎన్టీఆర్ జూనియర్‌తో రూపొందించే సినిమాకు సిద్ధమవుతున్నాడు. NTR31 వ్యవహరిస్తున్న సినిమాను సలార్ తర్వాత చేయనున్నారు. ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు తర్వాత కేజీఎఫ్3 సినిమాపై ప్రశాంత్ నీల్ దృష్టిపెట్టే అవకాశం ఉందని కన్నడ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

KGF3 బ్యాక్ డ్రాప్ ఏమిటంటే?
ఇదిలా ఉండగా, KGF3 మూవీకి సంబంధించిన కథ, బ్యాక్‌డ్రాప్‌పై ఆసక్తికరమైన కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ కర్ణాటక బ్యాక్‌డ్రాప్‌గా నడిచింది. KGF3 మాత్రం అమెరికా, ఇతర దేశాల బ్యాక్‌డ్రాప్‌తో కథ నడుస్తుంది. రాకీ భాయ్‌పై అమెరికా, ఇండోనేషియాలో నమోదైన కేసుల నేపథ్యంగా కథ సాగుతుంది అనే విషయం బయటకు వచ్చింది.

KGF3 ప్రారంభం ఎప్పుడంటే..
ఇక KGF3 చిత్రం మాత్రం వచ్చే రెండేళ్లలో ప్రారంభం కష్టమే అనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నారు. #NTR31 మూవీ పూర్తయిన తర్వాతే KGF3 ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే.. KGF3 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే KGF3 2025 చివర్లలో గానీ, 2026లో గానీ రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది అంటూ సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











