»   » మహేష్ ,మురగదాస్ సినిమాలో ఇంకో హీరో కీ రోల్, అసలు స్టోరీ లైన్ ఇదే?

మహేష్ ,మురగదాస్ సినిమాలో ఇంకో హీరో కీ రోల్, అసలు స్టోరీ లైన్ ఇదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తుండగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సెట్స్ పై ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు అభిమానులును ఆనందపరుస్తూనే ఉన్నాయి. తాజాగా మీకో సెన్సేషన్ న్యూస్ అందించబోతున్నాం.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటుల విషయంలోనూ రెండు భాషలకు చెందిన నటీనటులను చిత్ర యూనిట్ తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహేష్-మురగదాస్ సినిమాలో విలన్ గా తమిళ్ దర్శకుడు నటుడు ఎస్.జె. సూర్య నటిస్తుండగా, మరో యంగ్ భరత్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. భరత్ అంటే మరెవరో కాదు... గతంలో మనకు ప్రేమిస్తే సినిమాతో పరిచయమైన హీరోనే.

అతను మహేష్ కు తమ్ముడు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో కథను మలుపుతిప్పే పాత్ర అదని అందుకే వెంటనే భరత్ ఓకే చేసాడని అంటున్నారు. భరత్ తెలుగులోనూ మార్కెట్ ఉండటంతో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

లొసుగులను అడ్డం పెట్టుకుని..

లొసుగులను అడ్డం పెట్టుకుని..

ఇక ఈ చిత్రం కథ గురించి తమిళ సినీ సర్కిల్స్ లో ఓ కథనం ప్రచారం లోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపిస్తారు. ఇండియన్ లీగల్ సిస్టమ్ లో లొసుగులు అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తున్నవారిపై యుద్దం ప్రకటిస్తారు.

అన్నదమ్ముల మధ్యే...

అన్నదమ్ముల మధ్యే...

అలాగే ఈ చిత్రంలో మహేష్ కు, అతని సోదరుడుకు మద్య యుద్దం నడుస్తూంటుంది. అయితే అతని సోదరుడుగా కనిపించేది ఎస్ జె సూర్య కాదట. తమిల హీరో భరత్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ లలో ఇది ఒకటి అంటున్నారు.

తుపాకి టైప్ ట్విస్ట్ లు

తుపాకి టైప్ ట్విస్ట్ లు

తన తమ్ముడు విలన్ మనిషి ని తెలుసినప్పుడు అతన్ని పట్టుకోవాల్సిన పరిస్దితుల్లో హీరో మధన పడటం...ఎత్తుకు పై ఎత్తులుతో కథ నడుస్తుందని చెప్తున్నారు. మురగదాస్ గత చిత్రం తుపాకి తరహాలో ట్విస్ట్ లతో సినిమా నడుస్తుందంటున్నారు.

రిజిస్టర్ చేయించారు

రిజిస్టర్ చేయించారు

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరుగుతుండగా, ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘సంభవామి' అనే పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆ టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించారు. మొదట ఈ సినిమాకి ‘ఏజెంట్‌ శివ' అనే పేరు ప్రచారంలోకి వచ్చింది.

కీ సీన్స్

కీ సీన్స్

అయితే చిత్ర యూనిట్ ‘సంభవామి'పేరుకే మొగ్గు చూపుతోందట. తమిళంలోనూ అదే పేరు ఖరారు చేస్తారని సమాచారం. ఇందులో మహేష్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌, పుణెల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

కొత్త సంవత్సరం కానుక

కొత్త సంవత్సరం కానుక

ఈ సినిమా టైటిల్, లోగోను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేయనున్నారు. అదే విధంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అహ్మదాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

English summary
'Premisthe' fame Bharath is now doing a key role in Mahesh Babu's movie 'Sambhavami' being directed by Murugadoss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu