»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ డేట్ మారింది!

‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ డేట్ మారింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో విడుదల అవుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ....మే నెలలో విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మే 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 

Sardaar Gabbar Singh

సంక్రాంతి సందర్భంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్' స్పెషల్ టీజర్ విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్‌లో లుంగీ ధరించి... చేతిలో గన్, గుర్రంతో దర్శనమిచ్చారు. ఈ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తనదైన డిఫరెంట్ స్టైల్ చూపించబోతున్నాడని ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఓ సీన్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ బాబును కాపాడే సీన్ ఉంటుందని.... ఆ సీన్లో అయాన్ నటించాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయాన్ ను తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

English summary
Film Nagar source said that, Sardaar Gabbar Singh release postponed. The movie releasing on May 06, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu