For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాహిత మహిళతో అక్రమ సంబంధం.. పాత్ర కోసం ప్రియదర్శి సరికొత్త అవతారం..

  |

  పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి పులికొండ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. కెరీర్ మొదట్లోనే మల్లేశం అనే సినిమా ద్వారా హీరోగా అవకాశం దక్కడంతో ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోడు ఏమో అని అనుకున్నారు కానీ ఎలాంటి పాత్రలు వచ్చినా వాటిని తనదైన శైలిలో నటిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఎక్కువగా ఆయన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వెబ్ సిరీస్ గురించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది వివరాల్లోకి వెళితే

  బికినీలో కరిష్మా తన్నా హై వోల్టేజ్ లుక్స్

  టెర్రరిస్ట్ గా వచ్చి పెళ్లి చూపులు

  టెర్రరిస్ట్ గా వచ్చి పెళ్లి చూపులు

  దర్శి 2016 లో టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్ట్ గా నటించారు. అదే సంవత్సరంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరో స్నేహితుడు కౌశిక్ పాత్రలో అందరి దృష్టిలో పడ్డాడు. తెలంగాణా యాసలో ఆయన డైలాగ్స్ అన్నీ కలిపి ఆయనకు క్రేజ్ లభించింది. మల్లేశం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఆయన ఆ తరువాత కూడా ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ముందుకు వెళుతున్నారు.

  జాతిరత్నాలులో మెరిసి

  జాతిరత్నాలులో మెరిసి

  ఈ ఏడాది మొదట్లో జాతిరత్నాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియదర్శి ఆ సినిమాలో నటనకు గాను మంచి మార్కులు సంపాదించారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే రిలీజ్ తర్వాత భారీ కలెక్షన్లు సంపాదించింది.

  వెబ్ సిరీస్ కి పెరిగిన క్రేజ్

  వెబ్ సిరీస్ కి పెరిగిన క్రేజ్

  ఇక ఈ మధ్యకాలంలో సినిమాలకంటే వెబ్ సిరీస్ కు ఆదరణ పెరిగింది. సినిమా అంటే రెండున్నర గంటల్లో పూర్తి చేయాలనే నిబంధన ఉంటుంది కానీ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేసినా ఎన్ని సీజన్స్ రిలీజ్ చేసినా అడిగే వారు ఎవరూ ఉండరు. ఈ నేపథ్యంలోనే అందరూ సినిమాల కంటే వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలు కూడా ఈ వెబ్ సిరీస్ నిర్మించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో యువ దర్శకులు నటులు కూడా ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ మీద దృష్టి పెడుతున్నారు.

  ప్రియదర్శి కీలక పాత్రలో సిరీస్

  ప్రియదర్శి కీలక పాత్రలో సిరీస్

  నిజానికి ప్రియదర్శి ఇప్పటికే పలు వెబ్ సిరీస్ చేశారు. గతంలో జీ5లో వచ్చిన లూజర్ సహా ఆహాలో వచ్చిన కంబాలపల్లి కథలు అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఆయన మరో వెబ్ సిరీస్ చేస్తున్నారని పెళ్లైన ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ షూట్ అంతా పూర్తి అయిందని తెలుస్తోంది.

  వివాహేతర సంబంధం పెట్టుకుని

  వివాహేతర సంబంధం పెట్టుకుని


  ఈ సిరీస్ లో ప్రియదర్శి నందిని రాయ్ తో కలిసి నటించబోతున్నాడని తెలుస్తోంది.. ఈ సిరీస్ నందిని రాయ్ కి డిజిటల్ ఎంట్రీ ప్రాజెక్ట్ కానుంది. ఈ సిరీస్ లో సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా నటిస్తున్నాడు. పోసాని కృష్ణమురళి నందిని రాయ్ భార్యాభర్తలుగా నటిస్తుండగా నందిని రాయ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారని తెలుస్తోంది. నేటి సమాజంలో ఎక్కువగా వింటున్న వివాహేతర సంబంధాలను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది.

  Jathi Ratnalu ఫస్ట్ డే కలెక్షన్స్ , బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు!!
  మే 21న

  మే 21న

  ఈ సిరీస్ కధలో భర్త పోసాని కృష్ణ మురళి నందిని చంపేస్తుంది అని తెలుస్తోంది. అయితే ఆ మర్డర్ కేసు తన మీద పడకుండా బాడీని మాయం చేయడం కోసం ప్రియదర్శి హెల్ప్ అడుగుతుందని చెబుతున్నారు. అయితే ఆమెకు దగ్గర సాన్నిహిత్యం పెంచుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆమెకి హెల్ప్ చేస్తాడని అలా ఈ స్టోరీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని తెలుస్తోంది. నేమ్ ఆఫ్ ది గాడ్ పేరుతో సిద్ధమైన ఈ వెబ్ సిరీస్ మే 21వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  English summary
  Priyadarshi forayed into digital medium with Loser, last year for Aha. He then went on to another film Mail with Aha and he signed another web series In The name Of God. In this series, Priyadarshi is paired alongside NandiniRai. Senior actor Posani Murali Krishna also playing the husband role of Nandini Rai. Some intresting news came about the role of priyadarshi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X