»   » ఆయనతో సంబంధం అంటగట్టద్దు: ప్రియమణి

ఆయనతో సంబంధం అంటగట్టద్దు: ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆయనతో కలిసి అనేక సినిమాల్లో నటించినంత మాత్రాన మా ఇద్దరి మధ్య సంబంధం అంటగట్టడం సబబు కాదు. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు అని ప్రియమణి తేల్చి చెప్పింది. జగపతి బాబు, ప్రియమణి మధ్య వృత్తిపరమైన సంబంధాన్ని మించిన అనుబంధం ఏదైనా ఉందంటూ కథనాలు మీడియాలో సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే ఆమె ముందుంచినప్పుడు మండిపడుతూ సమాధానం చెప్పింది. ఆమె మాటల్లోనే....జగపతి బాబుతో కలిసి తొలిసారిగా నేను 'పెళ్లైన కొత్తలో...'నటించాను. ఆ సినిమా పెద్ద హిట్‌ చిత్రంగా నిలిచింది. అలాగే తర్వాత జగపతి బాబుతో కలసి 'ప్రవరాఖ్యుడు' చిత్రంలో నటించాను. ఆ సినిమా కూడా బాగానే ఆడింది.

అలాగే ఇటీవల విడుదలైన 'సాధ్యం' చిత్రంలో కూడా జగపతిబాబుకు జోడీగా నటించాను. అలాగనీ మా ఇద్దరి మధ్యా సంబంధం ఉందంటే ఎలా అంటోంది. అలాగయితే ఎన్టీఆర్‌, రవితేజ, నితిన్‌ లాంటి హీరోలతో కలిసి పలు చిత్రాల్లో కూడా నటించాను కదా అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ప్రియమణి కన్నడ భాషలో గణేష్‌ హీరోగా 'ఎనో ఒంథార' చిత్రం షూటింగ్‌ లో కంటిన్యూగా పాల్గొంటోంది. మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న రక్తచరిత్ర కోసం ముంబై వెళ్ళి వచ్చింది. ప్రస్తుతం చిక్‌ మగళూరులో ఉన్నామె...ఈ షెడ్యూల్‌ ముగిసిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ గ్రీస్‌కు వెళుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu