»   » నిండా మునిగాక చలి అంటే ఎలా నేను దేనికైనా రెడీ....

నిండా మునిగాక చలి అంటే ఎలా నేను దేనికైనా రెడీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల భామ ప్రియమణి దేనికైనా రెడీ అంటోంది. ఈ తమిళ కుట్టి ఇంత ఓపెన్ గా చెబుతున్నది దేని గురించి? అని ఆరాతీస్తే 'సినిమా విషయంలో"అని ఆరామంగా సమాధానమిస్తోంది. అదేంటో కాస్త వివరంగా చెప్పమ్మా అంటే 'నా దృష్టిలో సినిమాల విషయంలో తారతమ్యాలుండవు. ఏవైనా నటీనటుల్ని ప్రేక్షకులకు దగ్గర చేసేవే. కాకపోతే కొన్ని నటనకు ప్రాధాన్యమున్నవి ఉంటాయి. మరికొన్ని కమర్షియల్ గా చేయాల్సినవి ఉంటాయి.

నిండా నీటిలో మునిగాక చలి అంటే ఎలా కుదరదో..సినిమా పరిశ్రమలోకి వచ్చాక నేను గ్లామర్ పాత్రలు చేయను అనడం కూడా తగదు. అందుకే కథ నచ్చాలేగానీ ఏ సినిమా చేయడానికైనా నేను సిద్దమే" అని సెలవిచ్చిందీ బెంగుళూరు సోయగం. అన్నట్టు ఈ ఏడాది ప్రయమణి ఖాతాలో సినిమాలు చాలానే ఉన్నాయి. అక్కినేని నాగార్జున సరసన 'రగడ", సుమంత్ సరసన 'రాజ్", రక్త చరిత్ర 2, విడుదలకు సిద్దంగా ఉన్నాయి. జగపతి బాబుతో నాలుగో సారి జతకడుతున్న చిత్రం సెట్స్ మీద షూటింగ్ జరుపుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu