»   » తెలుగు నిర్మాతకి ట్విస్ట్ ఇచ్చిన ప్రియాంకచోప్రా

తెలుగు నిర్మాతకి ట్విస్ట్ ఇచ్చిన ప్రియాంకచోప్రా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ తెలుగులో ఓ మెగా ప్రొడ్యూసర్ తన చిత్రంలో ప్రియాంకచోప్రాని తీసుకుని హీరో డేట్స్ పట్టాలని ప్లాన్ చేసారు. అందుకు తగినట్లుగా ముంబైలో దిగి ప్రియాంకచోప్రాని కలిసి విషయం చెప్పి డేట్స్ అడిగారు. తనకు డేట్స్ ఇవ్వటానికి సమస్య లేదుకానీ నా రెమ్యునేషన్ లో రూపాయి తగ్గటానకి వీలు లేదని కండీషన్ పెట్టింది. సరేనన్న ఆ నిర్మాత ఆమె మేనేజర్ ద్వారా రెమ్యునేషన్ డిటేల్స్ కనుక్కుని హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనై ఆ రాత్రే హైదరాబాద్ ప్లైట్ ఎక్కేసారు. ఇంతకీ ప్రియాంక అడిగిన మొత్తం ఎంతంటే...ఎనిమిది కోట్లు. ఆ మొత్తం ఆమె హిందీలో కూడా తీసుకోవటం లేదు. తెలుగులో ముంబై భామలకు మంచి డిమాండ్ ఉందని, రేట్స్ బాగుంటాయని విన్న ప్రియాంక ఆ రేంజిలో ఎక్సపెక్ట్ చేసింది. ఇక ఆ నిర్మాత హీరో డేట్స్ దేమెడెరరుగు..ఆ ఎనిమిది కోట్లతో తెలుగులో స్ట్రైయిట్ గా రెండు సినిమాలు చేయచ్చు...ముంబై అమ్మాయిలకి ఓ రేటు ఫిక్స్ చేయాలి అని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రపోజల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu