»   » తెలుగు దర్శకుడుతో అశ్వనిదత్ కుమార్తె వివాహం

తెలుగు దర్శకుడుతో అశ్వనిదత్ కుమార్తె వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ వివాహం తెలుగు సినిదర్శకుడు నాగ్ అశ్విన్ తో జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమాకు చేసారు.

ఎవడే సుబ్రమణ్యం నిర్మాణ సమయంలోనే ప్రియాంకదత్, నాగ్ అశ్విన్ ప్రేమలో పడినట్లు సమాచారం. మొదటే ఆమే ప్రపోజ్ చేసినట్లు..నాగ్ అశ్విన్ ఓ మీడియా సంస్దతో మట్లాడుతూ చెప్పినట్లు తెలుస్తోంది.

Priyanka Dutt to marry director Nag Ashwin

త్వరలోనే ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివాహం డిసెంబర్ లో చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నాగ అశ్విన్ తల్లి తండ్లురు సిటీలో పేరున్న డాక్టర్స్. ప్రముఖ జె.జె హాస్పటిల్ అశ్విన్ తల్లే నడుపుతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ...ఓ కొత్త చిత్రం స్క్రిప్టు పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Producer Ashwini Dutt’s younger daughter Priyanka fell in love with her director Nag Ashwin. They fell in love during the shooting of the movie and now the lovers got approval from both the parents for their marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu