»   » ఇండస్ట్రీ నుండి ‘గబ్బర్ సింగ్’ నిర్మాత బండ్ల గణేష్ ఔట్?

ఇండస్ట్రీ నుండి ‘గబ్బర్ సింగ్’ నిర్మాత బండ్ల గణేష్ ఔట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్..... ఇది నిన్నటి మాట. ఎందుకంటే ప్రస్తుతం ఇతగాడు అసలు ఇండస్ట్రీలోనే లేకుండా పోయాడని టాక్. పవన్ కళ్యాణ్ హీరోగా 2009లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ ఈ చిత్రానికి సీక్వెల్ 'సర్దార్ గబ్బర్ సింగ్' వచ్చే సమయానికి సినీ పరిశ్రమలో తన ఉనికిని కోల్పోవడం గమనార్హం.

'గబ్బర్ సింగ్' చిత్రంతో బాగా పాపులర్ అయిన బండ్ల గణేష్ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో చిత్రాలు తీసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాద్ షా, టెంపర్, రామ్ చరణ్ తో 'గోవిందుడు అందరివాడేలే', అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' లాంటి భారీ చిత్రాలు తీసారు.


ప్రస్తుతం గణేష్ అసలు సినిమాలే తీయడం లేదు. హైదరాబాద్ లో తన ఆఫీస్ కూడా ఎత్తేసాడని తెలుస్తోంది. సినిమా పరిశ్రమకు వీలైనంత దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. తన కోళ్ల పెంపకం వ్యాపారాన్నే చూసుకుంటున్నాడట. నిర్మాతగా పూర్తిగా నష్టపోవడం వల్లనే అతను ఇండస్ట్రీని వదిలి పెట్టాడని అంటున్నారు.


గత ప్రభుత్వ హయంలో మంత్రిగా పని చేసిన ఓ నాయకుడికి బండ్ల గణేష్ బినామీ అనే ఆరోపణలు గతంలో వినిపించాయి. అయితే ఆ వార్తలను బండ్ల గణేష్ గతంలోనే ఖడించారు. అయితే ప్రభుత్వం మారాక ఆ నాయకుడు సైడ్ అయిపోవడం... బండ్ల గణేష్ కూడా సినిమా రంగం నుండి సైడ్ అయిపోవడం గమనార్హం.


మరో వైపు నటుడు సచిన్ జోషితో డబ్బులకు సంబంధించిన వివాదం కూడా నడుస్తోంది. వీరి వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. ఈ వివాదం తర్వాత నుండి బండ్ల గణేష్ కనీసం సినిమా ఫంక్షన్లలో కూడా కనిపించడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి తాను భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తన భక్తిని మాత్రం చాటుకుంటూనే ఉన్నారు.


ఈ రోజు బండ్ల గణేష్ చేసిన ట్వీట్

ఈ రోజు బండ్ల గణేష్ చేసిన ట్వీట్

ప్రజల నుండి పుట్టిన ఆయుధం నువ్వు...జిందాబాద్ బాస్ అంటూ గణేష్ ట్వీట్.


సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ కమింగ్ అంటూ గణేష్ ట్వీట్


ఉనికి కోల్పోయాడు

ఉనికి కోల్పోయాడు

పవన్ కళ్యాణ్ హీరోగా 2009లో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ ఈ చిత్రానికి సీక్వెల్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' వచ్చే సమయానికి సినీ పరిశ్రమలో తన ఉనికిని కోల్పోవడం గమనార్హం.


వస్తాడా? రాడా?

వస్తాడా? రాడా?

బండ్ల గణేష్ మళ్లీ సినిమా రంగం వైపు వస్తాడా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.


English summary
Film Nagar source said that, Producer Bandla ganesh close to Madhapur office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X