»   »  కంట్రోల్ తప్పి వి.వి వినాయిక్...టెన్షన్ లో నిర్మాత ?

కంట్రోల్ తప్పి వి.వి వినాయిక్...టెన్షన్ లో నిర్మాత ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Producer Bellamkonda Suresh fuming over V.V. Vinayak ?
హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందింస్తున్న చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ ముప్పై కోట్లు అని దిగారని, అది నలభై దాకా చేరిందని సినీ సర్కిల్స్ లో ప్రచారం అవుతోంది. బెల్లంకొండ తన కుమారుడే హీరో కాబట్టి ఆ లాంచింగ్ చిత్రానికి కూడా 30 కోట్లు వరకూ ఓకే అనుకుని ఖర్చు పెడుతున్నాడని, అయితే ఈ బడ్జెట్ పెరగటం అనేది ఆయన్ను టెన్షన్ పెడుతోందని చెప్తున్నారు. ఇప్పటికే ఆ బడ్జెట్ 35 కోట్లు వరకూ అయ్యిందని, మరో ఐదు కోట్లు పైనే మిగతా వాటికి ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తున్నారు.

ఆ బడ్జెట్ లో పది కోట్లు వినాయిక్ రెమ్యునేషన్ క్రిందే తీసుకున్నారని, రెండు కోట్లు సమంతకు ఇచ్చారని అంటున్నారు. మరి ఏ రేంజిలో బిజినెస్ అయితే ఈ బడ్జెట్ రికవరి అవుతుందనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల ముందున్న ప్రశ్న. ఇక ఈ చిత్రానికి 'అల్లుడు శీను ' అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి టైటిల్ కొత్త జనరేషన్ హీరోకి పెట్టబోవటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే నేటివిటికి దగ్గరగా ఉంటుందని ఈ టైటిల్ పెట్టబోతున్నట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ ని అందరనీ ఈ చిత్రం కోసం ఆయన సమకూర్చారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ... నేను బెల్లంకొండ సురేష్ కుమారుడుని లాంచ్ చేయటానికి కమిటయ్యాను. ఎందుకంటే ఆయన నా మొదటి నిర్మాత. ఆది సినిమాతో నాకు కెరీర్ ఇచ్చిన వ్యత్తి. అందుకో ఆయన కుమారుడు చిత్రాన్ని నేను మంచి స్క్రిప్టుతో చేయాలనుకుంటున్నాను. అందుకోసం చాలా కథలు విన్నాను...కానీ నన్ను ఏదీ తృప్తి పరచలేదు. నాకు నచ్చింది బెల్లంకొండ కు నచ్చలేదు. అయితే ఫైనల్ గా ఓ లైన్ ని ఓకే చేసుకున్నాం. దాంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.

బెల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.

ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.

English summary
Bellamkonda Suresh's son Srinivas is hoping to make a mark with his very first film under the direction of this ace director V.V. Vinayak . However, there is a rumor that Bellamkonda Suresh is not happy with Vinayak as the film's budget has already been overshot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu