For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కెరీర్‌లో ఫస్ట్ టైం: మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. కానీ వాళ్లెవరూ ముందుకు రావట్లేదట.!

  By Manoj
  |

  నందమూరి తారక రామారావు కుమారుడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు బాలకృష్ణ. తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ స్టేటస్‌ను అందుకున్నారాయన. అదే సమయంలో దర్శకుడు ఏది చెబితే అది చేసుకుపోయే హీరోగా కూడా పేరు సంపాదించుకున్నారు. అందుకే కొత్త వారితో పాటు వరుస పరాజయాలతో బాధపడే దర్శకులకు కూడా అవకాశం కల్పించారు. ఇక, తాజాగా ఆయన ఓ సీనియర్ డైరెక్టర్‌తో సినిమాను ఓకే చేసేశారు. ఆ వివరాలు మీకోసం.!

  నిరాశతో పాటు నష్టాలు వచ్చాయి

  నిరాశతో పాటు నష్టాలు వచ్చాయి

  నందమూరి బాలకృష్ణకు గత ఏడాది అస్సలు కలిసి రాలేదు. 2019లో ఆయన నటించిన మూడు సినిమాలు (యన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలతో పాటు రూలర్) విడుదలవ్వగా.. అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. వీటిలో ఎన్టీఆర్ బయోపిక్‌కు ఆయనే నిర్మాతగానూ వ్యవహరించారు. దీంతో నిరాశతో పాటు నష్టాలు కూడా వచ్చాయి.

  హ్యాట్రిక్ కోసం ఆయనతో మళ్లీ కలిశారు

  హ్యాట్రిక్ కోసం ఆయనతో మళ్లీ కలిశారు

  వరుస పరాజయాలతో బాధ పడుతున్న బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. దీంతో ఈ సారి కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలని ఈ జంట భావిస్తోంది. ఇందుకోసం అటు దర్శకుడు.. ఇటు హీరో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

   అందరి దృష్టి బాలయ్య పైనే.. కారణం ఇదే

  అందరి దృష్టి బాలయ్య పైనే.. కారణం ఇదే

  నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలోనూ నందమూరి హీరో నట విశ్వరూపం చూపించడం ఖాయమని అనుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే బాలయ్య సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకోసమే లుక్‌, బాడీ లాగ్వేజ్‌లో వేరియేషన్ చూపించబోతున్నాడట.

  మరో సినిమాను కూడా సెట్ చేసేశాడు

  మరో సినిమాను కూడా సెట్ చేసేశాడు

  బోయపాటి శ్రీనుతో బాలయ్య చేసే సినిమాకు సంబంధించిన షూటింగ్ రెండు రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇది పూర్తయి.. సినిమా విడుదల అయ్యే సరికి ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ నందమూరి హీరో మరో సినిమాను సెట్ చేసుకున్నారని తాజాగా ఓ వార్త లీక్ అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాను బీ గోపాల్ తెరకెక్కించనున్నారట.

  కానీ వాళ్లెవరూ ముందుకు రావట్లేదట.!

  కానీ వాళ్లెవరూ ముందుకు రావట్లేదట.!

  వాస్తవానికి బీ గోపాల్‌తో బాలయ్య సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా దీనిపై బాలయ్య క్లారిటీకి వచ్చారట. రెండు రోజుల క్రితం గోపాల్ చెప్పిన కథ విన్న ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే, ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా జరగడం బాలయ్య కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం అన్న టాక్ వినిపిస్తోంది.

  ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్

  ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్

  తెలుగులో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలతో ఆయన పని చేసినప్పటికీ నందమూరి బాలకృష్ణకు పలు హిట్లు అందించారు. వీళ్లిద్దరి కలయికలో ‘లారీ డ్రైవర్', ‘రౌడీ ఇన్‌స్పెక్టర్', ‘సమరసింహా రెడ్డి', ‘నరసింహా నాయుడు' వంటి హిట్లు వచ్చాయి. ‘పల్నాటి బ్రహ్మనాయుడు' మాత్రం ఫ్లాప్ అయింది.

  English summary
  Bejawada Gopal is an Indian film director in the Telugu film industry. He is the Uncle of Telugu film Actor Venu Thottempudi and has directed over 30 Telugu movies. Some of his highly successful movies include Bobbili Raja, Lorry Driver, Assembly Rowdy, State Rowdy, Rowdy Inspector, Samarasimha Reddy, Narasimha Naidu, Indra, Maska etc.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X