»   »  భారీ ఫైట్స్ తో 'పులి' ప్రారంభం?

భారీ ఫైట్స్ తో 'పులి' ప్రారంభం?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ హీరోగా, 'ఖుషి' దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సింగమల రమేష్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్టు 'పులి'. ఈ చిత్రం రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ప్రారంభం కాకముందే ఈ చిత్రం ట్రేడ్ సర్కిల్స్ లో సంచలనం రేపటం విషేషం. తాజాగా పులి షూటింగ్ ఫ్రారంభ సన్నివేశం కోసం భారీ ఫైట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 4000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్ వైరైటీగా ఈ ఫైట్ చెయ్యటానికి ప్రిపేర్ అవుతున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్లో అనుకుంటున్నారు.

అందులోనూ ఎప్పుడూ వెరైటీ కోసం తపించే పవన్ ఈ చిత్రంలో తనదైన మార్కును చాలా సన్నివేశాలలో చూపటానికి అణుగుణంగా కథని మలిచారట. అందులోనూ 'జల్సా' పెద్ద పేరు తేకపోయినా బయ్యర్స్ ని నిరాశపరచకపోవటంతో చాలా హ్యాపీగా ఉన్నాడట. ఆ ఉత్సాహంతో ఈ చిత్రంలో మరింత ఎనర్జీగా కనపడతాడంటున్నారు. ఇక చాలా రోజులుగా హాట్ టాపిక్ గా మారిన పులి హీరోయిన్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే అంటున్నారు. ప్రస్తుతం 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చేసిన స్నేహా ఉల్లాల్ అయితే బావుటుందనే ఆలోచనలో ఉన్నారట. ఇక షూటింగ్ జూన్ 20 నుంచి రెగ్యులర్ గా జరుగుతుందంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X