»   » పవన్స్ ‘పులి’ టైటిల్ సాంగ్ వినాలంటే అది తెలిసుండాలి???

పవన్స్ ‘పులి’ టైటిల్ సాంగ్ వినాలంటే అది తెలిసుండాలి???

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యస్.జె.సూర్య దర్శకత్వం రూపొందుతోన్న 'పులి' చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియో ఇంకా విడుదలకాలేదు. కానీ టైటిల్ సాంగ్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ సాంగ్ ఎలాగో లీక్ అయ్యిందట. దీన్ని ఇంటర్ నెట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని విన్నవారు ఈ పాటలో దమ్ము లేదని, 'పులి' టైటిల్ కి ఈ టైటిల్ సాంగ్ కి ఏ మాత్రం సంబంధం లేని విధంగా ఉందని అంటున్నారు.

ఈ పాటలోని పదాలు అర్ధంకాక తల పట్టుకున్నారని తెలుస్తోంది. దీనికి కారణం ఈ పాట అసలు రష్యన్ బాషకి సంబంధించిందట. రష్యన్ వాసులు పార్టీ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఈ పాట వింటారని తెలుస్తోంది. ఈ పాటనే 'పులి" టైటిల్ సాంగ్ గా పెట్టారట. అందుకే ఈ పాట సరిగ్గా అర్ధంకావటం లేదనీ, రష్యన్ భాష తెలిసిన వారకి అర్థమవుతుందని తెలుస్తోంది. మరి వాళ్ళు విన్నది నిజంగానే 'పులి' టైటిల్ సాంగేనా అన్నది తెలియాల్సి వుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu