»   » ప్రారంభం కాలేదేంటి? పూరి కు పెద్ద క్వచ్చిన్

ప్రారంభం కాలేదేంటి? పూరి కు పెద్ద క్వచ్చిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుందంటూ ఓ ప్రెస్ నోట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమా కాదా అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే నితిన్ ..ప్రాజెక్టు ప్రారంభం కావాల్సిన రోజే ఈ సినిమాని ప్రారంభిస్తానని చెప్పారు పూరి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ లెక్క ప్రకారం జూన్ 15న ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరో ప్రక్క వరుణ్ తేజ గురించి కాకుండా చిరంజీవి తో చిత్రం స్క్రిప్టు పూర్తి నేరేషన్ పూర్తి అయ్యిందంటూ పూరి ట్వీట్ చేసారు. అందులో ఎక్కడా వరుణ్ తేజ గురించి ప్రస్తావించలేదు. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ తో ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా మారింది.

Puri and Varun Tej’s – No confirmation yet

వరుణ్ తేజ తాజా చిత్రం కంచెం విషయానికి వస్తే.. డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.

‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు.

English summary
Puri Jagan has announced that he will kick-start the movie cancelled by Nitin with a new hero and new producer on same date they have earlier intended to. If we have to go by Puri’s words, then the movie was supposed to start yesterday, but that hasn’t took place.
Please Wait while comments are loading...