»   » ఎన్టీఆర్‌ జీవితచరిత్రపై బాలయ్య సినిమాకి డైరక్టర్, నిర్మాత ఎవరంటే...

ఎన్టీఆర్‌ జీవితచరిత్రపై బాలయ్య సినిమాకి డైరక్టర్, నిర్మాత ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను త్వరలోనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్పారు. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం ఆయన రివీల్ చేయేలుదు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...దర్శకుడు పూరి జగన్నాథ్ ని ఈ చిత్రం కోసం సంప్రదించారని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆ పనిలో ఉన్నారని, స్క్రిప్టు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తారని సమాచారం. ఎన్టీఆర్ జయంతి రోజు ...28 మే న ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే అవకాసం ఉంది.

Puri approached for NTR's biopic?

బాలయ్య మాట్లాడుతూ... ఎన్టీఆర్‌పై సినిమా స్క్రిప్ట్ తయారవుతోందని, ప్రజలకు తెలియని విషయాలను సినిమాలో చూపిస్తామని అన్నారు. ఎన్టీఆర్‌ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని బాలకృష్ణ కోరారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరును ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

హిందూపురం టీడీపీలో వర్గాలు లేవని బాలకృష్ణ పేర్కొన్నారు. వర్గపోరు రాజకీయాలను టీడీపీ ఉపేక్షించదని అన్నారు. హిందూపురంలో చెలరేగిన వివాదంపై అంతర్గత విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. తనకు హిందూపురం, నిమ్మకూరు రెండు కళ్లలాంటివని అన్నారు. హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్నామని బాలకృష్ణ చెప్పారు.

English summary
Buzz in the industry is that Puri Jagannadh has been approached to direct late NTR's biopic, which is likely to be produced by Vishnu Induri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu