»   » పూరీ జగన్నాధ్, బాలకృష్ణ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

పూరీ జగన్నాధ్, బాలకృష్ణ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్, బాలకృష్ణ కాంబినేషన్లో చిత్రం ఆగినట్లే అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జూలై ఏడు నుంచి ఈ చిత్రం ప్రారంభం అయి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశాలున్నట్లు ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. కోన వెంకట్ చెప్పిన కథ బాలయ్య ఓకే చేయటాన్ని పాజిటివ్ గా తీసుకున్న పూరీ ఆ కథతోనే బాలయ్య చిత్రం చేస్తానని బెల్లంకొండకు మాట ఇచ్చినట్లు చెప్తున్నారు. గతంలోనూ కోనవెంకట్, పూరీ కాంబినేషన్లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి చిత్రాలు వచ్చి భాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసాయి. అందుకే మారు మాట్లాడకుండా పూరీ ఆ కథ విని తనదైన శైలిలోకి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ స్క్రిప్టు తయారు చేస్తున్నాడని అంటున్నారు. ఫైనల్ వెర్షన్ విని బాలయ్య ఓకే చేస్తే వెంటనే చిత్రం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. పూరీ రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్లి మరో కథ వండి వచ్చినా అదీ బాలకృష్ణకు ఎక్కలేదని వినికిడి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu