నాగ చైతన్య చిత్రంలో పూరీ జగన్నాధ్ గెస్ట్ రోల్
నాగార్జున, పూరీ జగన్నాధ్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకునే నాగ చైతన్య హీరోగా గౌతం మీనన్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. సినీ నేపధ్యంలో జరిగే ఈ ప్రేమ కథలో పూరీ జగన్నాధ్ తన రియల్ లైఫ్ పాత్ర అయిన దర్శకుడుగానే కనపడనున్నారు. నాగచైతన్య అసెస్టెంట్ డైరక్టర్ గా కనపడనున్నాడు. ఈ చిత్రానికి పూరీ గెస్ట్ అప్పీరియన్స్ ప్లస్ అవుతుందని బావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏం మాయ చేసావో అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ చిత్రానికి ఏఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక నాగచైతన్య ఈ చిత్రం పూర్తి కాకుండానే అజయ్ భువన్ దర్శకత్వంలో మరో చిత్రం కమిట్ అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అజయ్ భువన్ ఇంతకు ముందు హౌస్ ఫుల్ అనే చిత్రం రూపొందించారు. అది ఇంకా విడుదలకు నోచుకోలేదు.


Click it and Unblock the Notifications











