»   » ఎన్టీయార్‌ ‘420’, ఇదే సోషల్ మీడియాలో రచ్చ,నిజమెంత

ఎన్టీయార్‌ ‘420’, ఇదే సోషల్ మీడియాలో రచ్చ,నిజమెంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం మీడియా ఉన్న పొజీషన్ లో వస్తున్న వార్తల్లో నిజమెంతో ఉత్తిది ఎంతో తెలియటం లేదు. తాజాగా ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని , ఆ చిత్రానికి '420' అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలోనూ, మీడియా వర్గాల్లోనూ హల్ చల్ చేస్తోంది. అయితే పూరి జగన్నాథ్ ఈ టైటిల్ ని ఎక్కడా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఇదే టైటిల్ ప్రకటిస్తారన్నట్లుగా పేరున్న మీడియా పత్రికలలో సైతం రావటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Puri jagannadh,Ntr movie title 420?

ఇక ఎన్టీఆర్ ఇప్పుడు 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతాగ్యారేజ్‌' వంటి వరుస విజయాలతో మంచి ఉషారుగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడుకెరీర్‌లోనే పీక్‌ స్టేజ్‌లో ఉన్నాడు ఎన్టీయార్‌. ఈ నేపథ్యంలో ఎన్టీయార్‌ నటించబోయే తర్వాతి సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా పూరీ జగన్నాథ్‌ చెప్పిన కథకు ఎన్టీయార్‌ ఓకే చెప్పాడని సమాచారం. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో తారక్‌ కనబడనున్నాడట. ఈ సినిమాకు '420' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్ర్కిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట పూరీ అని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు పటాస్, సుప్రీమ్ అంటూ చెలరేగిపోయిన యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా ఎన్టీయార్‌ కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. పూర్తి స్ర్కిప్టు రెడీ చేసుకుని ఎన్టీయార్‌ను కలిసే ప్రయత్నంలో ఉన్నాడట. మరి ఎన్టీయార్‌ ఎవరికి చాన్స్‌ ఇవ్వనున్నాడో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే. అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ప్రస్తుతానికి లేదు. వక్కంతం వంశీతో చేయబోయే సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్టేనని వార్తలు వినబడుతున్నాయి.

English summary
Jr NTR next movie is titled as 420 – Puri Jagannadh’s direction.After grand success of Janatha Garage Jr.NTR rejected Vakkantham Vamshi movie and chosen Puri Jagannadh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu