»   » పూరీ జగన్నాధ్ 'నేనూ ..నా రాక్షసి' చిత్రంలో హైలెట్ అవే

పూరీ జగన్నాధ్ 'నేనూ ..నా రాక్షసి' చిత్రంలో హైలెట్ అవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్, రాణా కాంబినేషన్ లో రూపొందుతున్న నేనూ నా రాక్షసి చిత్రంలో డైలాగులు హైలెట్ గా నిలుస్తాయంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వరస ప్లాప్ ల్లో ఉన్న పూరి తన బలం అయిన డైలాగులుని ఈ చిత్రంలో చూపనున్నాడని, సినిమా కేవలం డైలాగులు కోసమే ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఫిల్మ్ నాయర్ జనర్ లో సాగుతుందని వినపడుతోంది. పూరీ జగన్నాధ్ తనకు తెలిసిన సైకాలజి, తన జీవితానుభవాలు, తాను నమ్మే ఓషో సిద్దాంతాలు,తన గురువు రామ్ గోపాల్ వర్మ లాజిక్ లు కలగలపి ఈ చిత్రం డైలాగులు వండాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. కథా పరంగా ఇదో డిఫెరెంట్ కాన్సెప్ట్ అని, ఫిల్మ్ నాయర్ జనర్ కి చెందిన కధాంశమని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu