తప్పు చేస్తున్నానని ఆలోచనలోనే ఎన్టీఆర్...
'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. పూరి ముందు కూడా రెండు ప్రాజెక్టులున్నాయి. అవి పూర్తయిన తరవాతే ఈ 'ఆంధ్రావాలా' కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లొచ్చు.
అలాగే ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం రానున్నదంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రారంభమవుతుందని మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ ప్రస్తుతం లేదని కొరటాల శివ కొట్టిపారేస్తూ ట్వీట్ చేసారు.
కొరటాల శివ ట్వీట్ లో... మేమిద్దరం మా ప్రాజెక్టు లలో బిజీగా ఉన్నాం. ఎన్టీఆర్ ఇప్పటికే కందిరీగ దర్శకుడు సినిమా చేస్తున్నారు. మే నెల దాకా ఆ చిత్రం షెడ్యూల్ ఉంది. మరో ప్రక్క కొరటాల శివ..మహేష్ బాబుతో యు టీవి బ్యానర్ లోచేసే చిత్రం జూన్ లేదా జూలై లో ప్రారంభమవుతుంది. కాబట్టి మేమిద్దరం తర్వాత కలిసి పనిచేస్తాం అంటూ ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications












