»   » చిరంజీవితో అదే ప్రాబ్లమ్: పూరి

చిరంజీవితో అదే ప్రాబ్లమ్: పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "నేను చిరంజీవిని మాస్ స్టార్ గా ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాను. కానీ ఆయన సోషల్ మెసేజ్ కావాలంటున్నారు. అదే లాక్ మా ఇద్దరి మధ్యన సినిమా కాకుండా ఆపుతోంది. ఆయన ఎప్పుడూ మెసేజ్ కావాలంటున్నారు, నాకు జనాలను మసాలతో ఎంటర్టైన్ చేయటం మాత్రమే వచ్చు ", అంటున్నారు పూరి. పూరి,చిరంజీవితో 150 వ చిత్రం అనుకున్నారు కానీ అది మెటీరియలైజ్ కాలేదు. దానికి కారణం ఇదేనని చెప్పుకొచ్చారు పూరి జగన్నాధ్.

కంటిన్యూ చేస్తూ పూరి "అయినా ఆయనతో 150 వ సినిమా కాకపోతే, 151 చేస్తా , అదీ కాకపోతే 152 చేస్తాను. చిరంజీవి గారితో చేయటం అనేది నా లక్ష్యం. అంతేకానీ ఫలానా నెంబర్ ఉన్న సినిమా కాదు " అని చెప్పుకొచ్చారు..

Puri Jagannth about Chiranjeevi movie

తనకేంకావలో తెలుసు చిరంజీవికి..అదే విధంగా చిరు అభిమానులకు ఏం కావాలో తెలుసున్న ఏకైక డైరక్టర్ పూరి. చిరు సినిమాని పూరి చేస్తారని అభిమానులు ఉత్సాహంలో ఎదురుచూస్తున్నారు..ఒక వేళ ఇది మిస్ ఫైర్ అయితే పరిస్థితేంటీ అన్నదే చర్చ నడుస్తోంది.

పూరి సినిమా లోఫర్ కాస్తా బాగున్నా చిరంజీవి అవకాశం ఇవ్వచ్చు అన్న భావన కూడా ఉంది..కాకపోతే 150 వ సినిమా మరోక డైరక్టర్ చేస్తే..తన తదుపరి చిత్రం పూరి మాస్ మసాలని అందిస్తాడని చెప్పుకుంటున్నారు.

English summary
Puri want to project Chiranjeevi as a mass star. And Chiru wants to give some social message. That's the lock that is stopping them.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu