»   »  షాకింగ్: పూరి జగన్...పూర్తి విప్లవ చిత్రం

షాకింగ్: పూరి జగన్...పూర్తి విప్లవ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ అంటే డైలాగులుకు, స్పీడుగా చిత్రాన్ని క్వాలిటీతో తెరకెక్కించటంలోనూ పెట్టింది పేరు. తాజాగ ఆయన చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా విప్లవం నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆర్. నారాయణ మూర్తి హీరోగా చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ మధ్యనే నారాయణ మూర్తిని కలిసిన పూరి ఓ కథని నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూరి స్వంత బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కే అవకాసం ఉంది. ఈ చిత్రంలో నారాయణ మూర్తి పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుందని, నారాయణ మూర్తి ఇప్పటివరకూ ఏ సినిమాలో చూపని యాంగల్ లో చూపనున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఇంతకు ముందు సైతం పూరి జగన్నాథ్ తన టెంపర్ చిత్రంలో నారాయణ మూర్తిని అడగటం జరిగింది. అయితే నారాయణ మూర్తి నో చెప్పటంతో పోసాని ఆ పాత్ర చేసారు.

Puri jagannth-Narayanamurthy combo shortly?

ఇక ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. జూనియ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమా పూర్త‌వ‌టంతో త‌న భ‌విష్య‌త్ సినిమాల ప‌నిలో ప‌డిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపాడు. త‌ను ఛార్మీ తో తీయ‌బోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్ల‌డించాడు. అయితే ఈ సినిమా నర్త‌కి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించాడు.

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.

English summary
Puri Jagannath may soon direct revolutionary actor and film maker R.Narayanamurthy for his next.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu