పూరీ జగన్నాథ్ రిజిస్ట్రేషన్ చేసిన కొత్త టైటిల్

మోహన్ బాబు హీరోగా చేసిన 'అసెంబ్లీ రౌడీ'ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ చేస్తారని చాలా కాలం నుంచి వినపడుతోంది. అయితే రకరాల దర్శకులనుప అనుకున్నప్పడికీ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంచుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
ఇక ఈ చిత్రంలోని అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా జైల్లోపెడతా... అనే డైలాగులు అప్పట్లో ఎక్కడ విన్నా వినపడేవి. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ 'అసెంబ్లీ రౌడీ'చిత్రం రీమేక్ కాబోతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.
ఈతరానికి నచ్చేలా, వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతన్నాయి. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'దూసుకెళ్తా' చిత్రీకరణ తుది దశకు చేరింది. ఈ చిత్రం పూర్తయిన తరవాత 'అసెంబ్లీ రౌడీ' సెట్స్ మీదకు వెళ్ళే అవకాసం ఉందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఈ మేరకు కొత్త స్క్ర్రిప్టుని రెడీ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో 'అందమైన వెన్నెలలోన'పాటని సైతం రీమిక్స్ చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











