Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పూరీ,నితిన్ చిత్రం షూటింగ్ ఏ దేశంలో ?
రెండు వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతోంది. గతంలో వైష్ణో అకాడమీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తను ప్రారంభించిన కొత్త బ్యానర్ పూరీ జగన్నాథ్ టాకీస్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటిసారి వీరి కలయికలో తెరకెక్కే ఈ చిత్రం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ విషయాన్ని హీరో నితిన్ తెలియజేస్తూ, 'పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. ఆయన చెప్పిన సబ్జెక్టు వినగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ చేద్దామా! అన్న ఆతృత మొదలైంది. వ్యాపారాత్మక అంశాలు ఉన్న ఓ విభిన్నమైన ప్రేమకథ ఇది. ఈ నెలాఖరు నుంచి నిరవధికంగా యూరప్, గోవాలలో ఈ చిత్రం భారీ షెడ్యూల్స్ జరుగుతాయి. తప్పకుండా నా కెరీర్‌లో ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న నమ్మకం ఉంది. నా సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. మిగిలిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని అన్నారు.
బాలీవుడ్ భామ ఆద శర్మని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈమె ఫిర్,1920 చిత్రాలు చేసింది. నితిన్ కి ఆమె కరెక్టు పెయిర్ అని ఫోటో షూట్ చేసి పూరి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. షూటింగుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.