»   » పూరి, త్రివిక్రమ్ ..ఇద్దరికి ఒకే సమస్య...వేరేదారిలేక ఇద్దరూ అదే నిర్ణయం

పూరి, త్రివిక్రమ్ ..ఇద్దరికి ఒకే సమస్య...వేరేదారిలేక ఇద్దరూ అదే నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ డైరక్టర్స్ పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. అది ఒకే చిన్న హీరోతో చెయ్యాలని, ఆ హీరో మరెవరో కాదు...నాగ శౌర్య అని సమాచారం. తమ తదుపరి చిత్రాలు ఈ యంగ్ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యి డేట్స్ కోసం ఈ హీరోని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆలోచన మొదట ఎవరికి వచ్చింది. ఎవరు దాన్ని అనుసరించారు అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ట్
ఇద్దరూ స్టార్ డైరక్టర్సే, మహేష్, పవన్ వంటి స్టార్ హీరోలతో పని చేసినవారే. అయితేనేం ఇప్పుడు ఇద్దరూ స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్దితి. ఈ నేఫధ్యంలో అంతంత గ్యాప్ తీసుకోవటం ఇద్దరికీ ఇష్టం లేదు. అది గమనించే త్రివిక్రమ్ కాస్త క్రిందకు దిగి..నితిన్ హీరోగా ఓ సినిమా చేసాడు. పవన్ కళ్యాణ్ సలహాతో నితిన్ తో అ..ఆ వంటి హిట్ ఇచ్చాడు.

Puri and Trivikram wants to work with Naga Shourya

పూరి విషయానికి వస్తే...ఎన్టీఆర్ సలహా,సూచనతో ఆయన తమ్ముడు కళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రం పూర్తి చేసినట్లు సమాచారం. మళ్ళీ ఇధ్దరికి హీరోల డేట్స్ ప్లాబ్లం. మహేష్, పవన్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులలో బిజిగా ఉన్నారు. యంగ్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడా వరస పెట్టి సినిమాలు ఒప్పేసుకున్నారు.

దాంతో ఇద్దరూ తమ బలం అయిన స్క్రిప్టునే నమ్ముకునే తమ క్రేజ్ తో ఓ చిన్న హీరోతో సినిమా చేసి హిట్ కొట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకోసం యంగ్ హీరోలు కోసం అన్వేషిస్తే శర్వానంద్ , నానిలు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక మిగిలింది నాగ శౌర్య. అందుకే నాగశౌర్యతో ముందుకు వెళ్లాలని ఈ ఇద్దరు డైరక్టర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నిజంగా ఈ రెండు ప్రాజెక్టులు మెటీరియలైజ్ అయితే ఈ చిన్న హీరో పెద్ద హీరో అవుతాడనటంలో సందేహమైతే లేదు. ఏమంటారు.

English summary
Reports reveal that Puri, Trivikram would be working with budding hero Naga Shourya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu