For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa 2 మూవీ యూనిట్ కు సుకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్.. వైజాగ్ లో అలా జరగడమే కారణం!

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే నార్త్ ప్రజలేకాకుండా విదేశీయులు కూడా వాటిని రీల్స్, రీక్రియేట్ చేసేలా చేశాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చే 'పుష్ప: ది రూల్' పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఒక విషయంలో మూవీ టీమ్ పై సుక్కు సీరియస్ అయ్యారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది.

  ఒక్కో డైమండ్..

  ఒక్కో డైమండ్..

  పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఇక సమంత అదిరిపోయే స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.

   యాక్షన్ ఎంటర్టైనర్ గా..

  యాక్షన్ ఎంటర్టైనర్ గా..


  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం.

  రంగంలోకి జగపతి బాబు..

  రంగంలోకి జగపతి బాబు..

  పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్ క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పుష్పరాజ్ ను స్ట్రాంగ్ ఢీకొట్టబోయేందుకు తన సెంటిమెంట్ నటుడు అయిన జగపతి బాబును రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా జగపతి బాబుకు సంబంధించిన షూటింగ్ ను వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారని సమాచారం.

  అనసూయతో స్పెషల్ సాంగ్..

  అనసూయతో స్పెషల్ సాంగ్..


  'పుష్ప: ది రూల్' సినిమాలో ఫహాద్ పాజిల్ మాత్రమే కాకుండా ప్రధాన విలన్ గా జగపతి బాబు ఉండనున్నాడని టాలీవుడ్ టాక్. ఫహాద్ పాజిల్ కు అండదండగా నిలిచే పవర్ ఫుల్ పొలిటిషీయన్ గా జగపతి బాబు క్యారెక్టర్ ఉంటుందని భోగట్టా. ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయతో సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ అయింది. మొదటి పార్టులో నెగెటివ్ రోల్ లో కనిపించిన అనసూయతో రెండో పార్టులో స్పెషల్ సాంగ్ ఎలా చిత్రీకరిస్తాడని చర్చించుకున్నారు.

  సుకుమార్ సీరియస్..

  సుకుమార్ సీరియస్..

  ఇదిలా ఉంటే పుష్ప 2 చిత్రీకరణను అక్టోబర్ 30, 2022న ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు బన్నీ లుక్ కు సంబంధించిన ఫొటోను సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజేక్ షేర్ చేశాడు. ఆ ఫొటో తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న వైజాగ్ మూవీ యూనిట్ పై సుకుమార్ సీరియస్ అయ్యారని ఒక టాక్ నడుస్తోంది. మొదటి నుంచి పుష్ప 2కి లీక్ ల బెడద అంటుకోవడే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

  స్ట్రాంగ్ వార్నింగ్..

  స్ట్రాంగ్ వార్నింగ్..


  గతేడాది పుష్ప 2 నుంచి ఒక డైలాగ్ లీక్ అయింది. అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయి అంటే.. పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్పరాజ్ వచ్చాడని అర్థం అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ కూడా బయటకు వచ్చేసింది. ఇటీవల లాంగ్ హెయిర్ తో బన్నీ దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అది కాగా తాజాగా సెట్స్ నుంచి ఫొటోలు బయటకు రావడంతో.. సినిమా టీమ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

  English summary
  Tollywood Creative Director Scold Pushpa 2 Movie Unit In Vizag Schedule. Allu Arjun Photos Leaked In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X