twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF దెబ్బకి పుష్ప మేకర్స్ అలెర్ట్.. అంతకు మించి అనిపించేలా ప్లానింగ్!

    |

    అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలో థియేటర్లకు జనాలు వస్తారో రారో అనే పరిస్థితి నుంచి ఈ సినిమా కోసం జనం క్యూ కట్టే పరిస్థితికి తీసుకు వచ్చింది. మొదటి భాగం విడుదల చేస్తున్న సమయంలో బాలీవుడ్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ ఈ సినిమా మిగతా ప్రాంతాల్లో ఎంత కలెక్షన్లు రాబట్టింది బాలీవుడ్లో కూడా అంతే కలెక్షన్లు రాబట్టింది. దానికి తోడు ఈ మధ్య కాలంలో విడుదలైన కేజిఎఫ్ సీక్వెల్ సినిమా కూడా బాలీవుడ్ లో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమా రెండో భాగం మీద ఇప్పుడు మేకర్స్ దృష్టి పెట్టారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలకు పెంచారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    అల వైకుంఠ పురం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి శేషాచలం అడవి నేపథ్యంలో ఉన్న పుష్ప సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగా సినిమాలో హీరోయిన్ రష్మిక నటించడం, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, ఫహద్ ఫాసిల్ వంటి ఇతర కీలక నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు.

    థియేటర్లలో దుమ్మురేపి

    థియేటర్లలో దుమ్మురేపి


    మైత్రి మూవీ మేకర్స్, మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా మొదట ఒకే భాగంగా విడుదల చేయాలని భావించారు. అయితే కథ నిడివి పెరిగిపోతుండటంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని తొలుత మొదటి భాగాన్ని గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేశారు. అయితే ముందుగా ఒప్పందాల ప్రకారం ఈ సినిమా డిజిటల్ లో త్వరగా రిలీజ్ అయినా సరే థియేటర్లలో మాత్రం దుమ్మురేపింది.

     కలెక్షన్స్ భారీగా

    కలెక్షన్స్ భారీగా


    ట్రేడ్ వర్గాలు అంచనా మేరకు ఈ సినిమాకు మొత్తం 184 కోట్ల 62 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే నైజాం ప్రాంతంలో 40 కోట్ల 74 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 15 కోట్ల 17 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8 కోట్ల 13 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు, గుంటూరు జిల్లాలో ఐదు కోట్ల 13 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కోట్ల 95 లక్షలు, కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఇరవై లక్షలు, నెల్లూరు జిల్లాలో మూడు కోట్ల 8 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

    హిందీ మీద ఫోకస్

    హిందీ మీద ఫోకస్


    అలా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 85 కోట్ల 35 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటకలో 11 కోట్ల 81 లక్షలు, తమిళనాడులో 13 కోట్ల 75 లక్షలు, కేరళలో 5 కోట్ల 60 లక్షలు, హిందీలో 51 కోట్ల 30 లక్షల రూపాయలు వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూలు చూసుకుంటే హిందీలో వంద కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండో భాగాన్ని హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యే విధంగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

    ఏకంగా 400 కోట్లు

    ఏకంగా 400 కోట్లు


    అయితే ఇప్పుడు తాజాగా అక్కడ విడుదలైన కెజిఎఫ్ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగం మీద ఇప్పుడు మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. తొలుత తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకున్నారు కానీ ఈ సారి మాత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే నచ్చే విధంగా సినిమా ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియదు కానీ ఈ ప్రచారం మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది.

    English summary
    as per reports in social media, Pushpa 2 will have an overall budget amounting to Rs 400 crore
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X