Don't Miss!
- News
పోలీసు శాఖలో సీఎం కేసీఆర్ మార్క్ ప్రక్షాళన - అర్ద్రరాత్రి కీలక ఉత్తర్వులు..!!
- Sports
India Playing XI: పృథ్వీ షా రీ ఎంట్రీ.. న్యూజిలాండ్తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
- Finance
t+1 settlement: చరిత్ర సృష్టించిన భారత్.. ఇండియాను ఫాలో కానున్న అమెరికా..
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
వేరే లెవల్ కు పుష్ప.. ఐదు విదేశీ బాషలలో కూడా రిలీజ్.. ఎక్కడా తగ్గేదేలేదంటూ!
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అద్భుతమైన సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. తాజాగా ఒక సీక్వెల్ గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.. అదేమిటంటే ఈ సినిమా ఏకంగా 10 భాషల్లో విడుదలబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

సెకండ్ పార్ట్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన చిత్రం పుష్ప. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ నేపద్యంలో రూపొందించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో క్రేజ్ కూడా దక్కించుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా చేయబోయే సెకండ్ పార్ట్ మీద మేకర్స్ దృష్టి పెట్టారు.

ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో
కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నార్త్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న క్రమంలో రెండో భాగాన్ని నార్త్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే విధంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి కథాకథనాలు కూడా మారుస్తున్నారని, నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యే విధంగా సుకుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇక తాజాగా సమాచారం మేరకు ఈ సినిమాను కేవలం ఐదు భారతీయ భాషలోనే గాక మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆగస్టు నెలలో
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఒక పక్క ఒక టీం ప్రస్తుతానికి షూటింగ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అల ఒక టీం షూటింగ్లోకేషన్స్ ఫైనలైజ్ చేయడానికి పెడితే మరో టీం సుకుమార్ తో కలిసి స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇక ఈ రెండో భాగం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పుష్ప ఫ్రాంచైజ్
ఇక ఈ రెండో భాగం కూడా బాగా ఆడితే మూడో భాగం కూడా చేసే అవకాశం ఉందంటూ మొదటి భాగంలో భన్వర్ లాల్ పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఇక ఈ నేపద్యంలోనే కేజిఎఫ్ తరహాలో ఈ సినిమా కూడా మూడు భాగాలుగా విడుదలయితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని, పుష్ప ఫ్రాంచైజ్ కూడా అద్భుతమైన వసూళ్లు సాధించే అవకాశం ఉందని కొంతమంది సినీ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రణాళికలు సిద్ధం
మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రెండో భాగాన్ని కాదు మూడో భాగాన్ని కూడా సిద్ధం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లోనే కాక ఇతర భాషల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది.