»   »  ‘పివిపి’ మంచి మనసు: ‘బ్రహ్మోత్సవం’ బాధితులను ఆదుకుంటారట!

‘పివిపి’ మంచి మనసు: ‘బ్రహ్మోత్సవం’ బాధితులను ఆదుకుంటారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ అంచనాలతో వచ్చిన మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ ధరలకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి.

 PVP agreed voluntarily to bear half of the loss?

ఈ చిత్రాన్ని రిలీజ్ ముందే నిర్మాత పివిపి లాభాలకు అమ్మేసారు. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో 60 శాతమ మేర నష్టపోయే అవకాశం ఉందని, మరికొన్ని ఏరియాల్లో 40 శాతం మేర నష్టాలు తప్పని అంచనా వేస్తున్నారు.

'బ్రహ్మోత్సవం': చూడకుండా అడ్డుకునే ప్రయత్నం, ప్రతీకారమా?

అయితే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని పివిపి మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నష్టాల్లో సగం తాను భరిస్తానని, డబ్బులు తిరిగి ఇష్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ఇవన్నీ మామూలే అయినా.... నిర్మాత పివిపి మంచి మనసుతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక బ్రహ్మోత్సవం సినిమా చూసిన ప్రేక్షకులు కూడా....తాము బాధితులమే అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా గోడు వెల్లబోసుకుంటున్నారు. తమలా మరొకరు ఇలా బాధితులు కావొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారమే సినిమాను మరింత దెబ్బతీస్తోంది.

English summary
Buzz has that PVP agreed voluntarily to bear half of the Brahmotsavam loss, that will be borne by distributors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu