»   » 'రభస' దర్శకుడుకి అనారోగ్యం...షూటింగ్ వాయిదా

'రభస' దర్శకుడుకి అనారోగ్యం...షూటింగ్ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం రభస. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. అయితే రీసెంట్ గా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు జాండీస్ రావటంతో షూటింగ్ వాయిదా పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కొద్ది రోజులు పాటు రెస్ట్ తీసుకోమన్నట్లు చెప్తున్నారు. ఆరోగ్యం కుదుటపడితే జనవరి 16 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ విషయమై అథికారిక సమాచారం లేదు.

Rabasa director suffering with Jaundice

ఎన్టీఆర్‌ - ఈ మూడక్షరాల పేరు... పూనకం తీసుకొస్తుంది అభిమానులకు. ఎన్టీఆర్‌ అంటే దర్శకులకు సమ్మోహన శక్తి. ఎన్టీఆర్‌ అంటే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే నిధి. సంభాషణలు పలికే చాతుర్యానికి ఎవరైనా సలామ్‌ కొట్టాల్సిందే. నాట్యంలో మెరుపు వేగం చూసి నింగిలోని 'మెరుపు' కూడా మైమరచిపోతుంది. ''పాత్రలో ఒదిగిపోవడం, కొత్త వన్నెలు తీసుకురావడం ఎన్టీఆర్‌కే సాధ్యం...'' అని ఎవరైనా చెబితే అందులో అక్షరం కూడా అతిశయోక్తి లేదు. అందుకే ఆయన వెనుక విజయాలు, విజయాల వెనుక రికార్డులూ నడిచొచ్చేస్తుంటాయి. ఇప్పుడూ ఎన్టీఆర్‌ వచ్చేస్తున్నాడు.

సినిమా సినిమాకీ ఎదగడం అలవాటు చేసుకొన్నాడు ఎన్టీఆర్‌. 'ఇలాంటి పాత్రలకు మాత్రమే' అనే షరతులు ఎన్టీఆర్‌ దగ్గర లేవు. 'ఈ పాత్రలో ఎన్టీఆర్‌ సరిపోడేమో' అనే సందేహాలు ఎవరికీ రావు. 'స్టూడెంట్‌ నెం.1', 'ఆది', 'సింహాద్రి', 'రాఖీ', 'యమదొంగ', 'అదుర్స్‌', 'బృందావనం'... వీటిలో ఏ సినిమా మరో సినిమాకి పోలిక తీసుకురాలేదు. ప్రతీ సినిమాలోనూ కొత్త ఎన్టీఆర్‌ కనిపించాడు. తొడగొట్టాడు, గొడ్డలి పట్టాడు, కన్నీరు కార్చాడు, నవ్వాడు, నవ్వించాడు, స్లిమ్‌ అయ్యాడు, లవర్‌బోయ్‌లా మారాడు - ఎన్నో చేశాడు. తనని తాను మార్చుకొన్న ప్రతిసారీ ఎన్టీఆర్‌కి విజయం దక్కింది. ఇప్పుడు అభిమానుల బిరుదుకి తగ్గట్టు 'యంగ్‌ టైగర్‌'లా మారిపోయాడు.

English summary
Director Santhosh Srinivas is down with jaundice and has been advised to take few days rest by doctors. Due to this the film unit has taken a break from shooting of his upcoming film ‘Rabhasa’ and it will restart on Jan, 16th. Bellamkonda Suresh is producing the film on ‘Sri Laxmi Narasimha Productions’ banner. Samantha and Praneetha are playing female lead roles opposite NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu