twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా? : కావాలనే ‘రభస’చేయటం లేదా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస'విడుదలకు సిద్దమైంది. ఓ పెద్ద హీరో చిత్రం విడుదల అవుతోందంటే ఆ సందడే వేరు. అయితే ఈ చిత్రానికి అది కనపడటం లేదు. ఓ మూడు టీజర్స్ వదిలి ఊరుకున్నారు. పబ్లిసిటి ని భారీ ఎత్తున చేయటం లేదు. ఈ విషయమై ఎన్టీఆర్ అభిమానుల సైతం అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇది కావాలని బెల్లంకొండ, ఎన్టీఆర్ కలిసి అనుకుని అనుసరిస్తున్న స్టాటజీ అంటున్నారు.

    సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచకుండా సైలెంట్ గా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఇలా పబ్లిసిటీని తగ్గించారంటున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎన్టీఆర్‌ భారీ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. 'బాద్‌షా' బాక్సాఫీస్‌ ఫలితం పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వకపోవడం, 'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాపవడంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్‌ కలెక్షన్లతో 'రభస' చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు.

    'Rabhasa' Producer has decided

    దర్శకుడిగా తొలి సినిమా 'కందిరీగ'తో హిట్‌కొట్టిన సంతోష్‌ శ్రీనివాస్‌తో ఈ సినిమా చేస్తుండటం, క్రేజీ హీరోయిన్‌ సమంతతో ముచ్చటగా మూడోసారి జతకట్టడం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇంకా పబ్లిసిటీతో వాటిని పెంచేస్తే...వాటిని అందుకోవటం కష్టమైపోతుంది. అదే ఏ అంచనాలు లేకుండా సినిమా ముందుకు వస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

    ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ....'' 'రభస' విషయానికొస్తే పది నెలల కష్టమిది. చాలా అడ్డంకులు వచ్చాయి. దర్శకుడు సంతోష్‌ కామెర్లతో చాలా ఇబ్బంది పడ్డాడు. మంచి వాళ్లకు మంచే జరుగుతంది కాబట్టి తను అడ్డంకుల్ని అధిగమించగలిగాడు. అతని కోసమైనా ఈ సినిమా హిట్‌ కావాలి. తమన్‌ అద్భుతమైన బాణీలిచ్చాడు. 'ఆది' తర్వాత బెల్లంకొండ సురేష్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.'' అన్నారు.

    సమంత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌తో ఇది నా మూడో సినిమా. ఒక కథానాయికగా నాకిది గొప్ప విషయం. సినిమాలో వినోదం బాగుంటుంది. మనసు పెట్టి సినిమా చేశాడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌. తప్పక విజయం సాధిస్తుంది'' అన్నారు.

    సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ ''కథ చెప్పాక ఎన్టీఆర్‌ వెంటనే ఓకే అనేశారు. నాకు మాత్రం పది రోజులు నిద్రపట్టలేదు. అందుకే తన స్థాయికి తగ్గట్టుగా మళ్లీ హంగులు జోడించాను. నేను అనారోగ్యానికి గురైనా వెన్నుతట్టి నేనున్నాను అని భరోసా ఇస్తూ ఒక స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ నా కోసం మూడు నెలలు ఎదురు చూడటం ఎప్పటికీ మరచిపోలేని విషయం. ఎన్టీఆర్‌ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. 'కందిరీగ' ద్వారా నాకు దర్శకుడిగా జీవితాన్నిచ్చారు బెల్లంకొండ సురేష్‌. ఆయనతో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    'Rabhasa' Producer has decided not to create unnecessary hype at this juncture with aggressive publicity and wait for the content to speak for itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X