»   » ఆ హీరోయిన్ కి పోటీ ఉండకూడదనే ఆ ఇద్దరితో కలసి అలా చేసింది..!

ఆ హీరోయిన్ కి పోటీ ఉండకూడదనే ఆ ఇద్దరితో కలసి అలా చేసింది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిసెంబర్ లో అనుష్క నటించిన రగడ, నాగవల్లి రెండూ ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ అనుష్క ఈ రెండు చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. 'మగధీర" తో కాజల్ పుంజుకున్నాక అనుష్కకి కాంపిటీషన్ ఎదురైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే సమంత రావడంతో ఇంకో పోటీదారు పెరిగింది. వీళ్లిద్దరికీ ఈ రెండు చిత్రాలతో అనుష్క చెక్ పెట్టాలని చూస్తోంది. రగడతో గ్లామరస్ హీరోయిన్ గా తనకు తిరుగు లేదని ప్రూవ్ చేసుకునేందుకు, 'నాగవల్లి"గా నటిగా తనకు ఎదురులేదని చాటుకునేందుకు అనుష్క ఆరాటపడుతోంది. అయితే అనుష్క ఇప్పుడెంతగా ట్రై చేసినా ఇంకో రెండేళ్లలో పెట్టె సర్దుకోక తప్పదని, ఇప్పటికే ఆమె బాడీలో చాలా డిఫరెన్స్ వచ్చిందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu