»   » రామ్ చరణ్-కృష్ణ వంశీ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్

రామ్ చరణ్-కృష్ణ వంశీ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rachcha combo again in Krishna Vamsi's film
హైదరాబాద్ : సినిమాకు కథ సెట్ అవటం కన్నా కలిసివచ్చే హీరోయిన్ ని సెట్ చేసుకోవటం హీరోలకు అగ్ని పరీక్షగా మారింది. తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్న రామ్ చరణ్ ...హీరోయిన్ ని ఓకే చేసారు. తనతో రచ్చ చిత్రంలో అదరకొట్టిన తమన్న నే మరోసారి తన ప్రక్కన చేసే అవకాసం రామ్ చరణ్ ఇచ్చారు. ఈ మేరకు తమన్నాతో చర్చలు జరిగాయని తెలుస్తోంది.


జనవరి 23,2014 నుంచి చిత్రం రెగ్యులర్ షూట్ జరగనుంది. బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం లొకేషన్స్ వెతుకుతున్నారు. పొల్లాచ్చి లో మొదటి షెడ్యూల్ జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ చిత్రంలో వెంకటేష్ లేరని సమాచారం. ఆ ప్లేస్ లోకి శ్రీకాంత్ వచ్చి చేరారని తెలుస్తోంది. జనవరి 2014 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం కుటుంబ అనుబంధాలు చుట్టూ తిరగనుంది.

వెంకటేష్ ని కీలకమైన పాత్రలో అనుకున్నా..ఆయనకు హీరోయిన్ దొరక్కపోవటంతో బయిటకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాక రామ్ చరణ్ కే కథలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం, బల్క్ డేట్స్ కావాల్సి రావటంతో వెంకటేష్ తప్పుకోవటానికి కారణాలు గా చెప్తున్నారు. సంక్రాంతి నుంచి ఆస్ట్రేలియా షెడ్యూల్ తో సినిమా ప్రారంభం అవుతుంది.

ఈ సినిమాపై ఓ రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రం స్టోరీ లైన్ హిందీ మూవీ 'కభి ఖుషీ కభి ఘమ్' స్టోరీని పోలి ఉంటుందట. ఏది ఏమైనా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే వెంకటేష్-మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మంచి విజయం సాధించింది. అయితే మరో వైపు వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ మసాలా విడుదలై డిజాస్టర్ అయ్యింది.

English summary
Krishnavamsi has brought Tamannah in his next film with Ram Charan. After trying several names and auditioning many newcomers, Krishnavamsi reportedly okayed Tamannah.Currently, the director and producer Bandla Ganesh are in Pollachi scouting for locations. The film will commence its regular shoot from Jan 23, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu