»   »  గోపీచంద్ సాహసం: డైలాగు రైటర్ ని డైరక్టర్ ని చేసేసాడు

గోపీచంద్ సాహసం: డైలాగు రైటర్ ని డైరక్టర్ ని చేసేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రచయితలు కాలక్రమేణా దర్శకులుగా మారటం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. తాజాగా మరో డైలాగు రైటర్ ..సినీ దర్శకుడుగా మారుతున్నారు. ఆయన మరెవరో కాదు. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సాహసం చిత్రానికి డైలాగులు అందించిన రాధాకృష్ణ కుమార్. ఆయన గోపీచంద్ కి కథ చెప్పి ఒప్పించి,ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ మేరకు త్వరలోనే ఆఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

మరో ప్రక్క గోపీచంద్‌ హీరోగా భవ్య క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. గోపీచంద్‌ సినిమా అంటే.. ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అనూప్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ ప్రారంభించాం. 'శౌర్యం' తరవాత గోపీచంద్‌ చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది'' అన్నారు.

దర్సకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...''లక్ష్యంతో నా కెరీర్‌ ప్రారంభమైంది. దర్శకుడిగా నన్ను ప్రోత్సహించిన.. గోపీచంద్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా అంచనాలను అందుకొనేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు‌. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన, స్క్రీన్‌ ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌.

Radhakrishna to direct Gopichand

ప్రస్తుతం గోపీచంద్..బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని చెప్తున్నారు. ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్‌ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్‌, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్‌, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. రిలీజ్,ఆడియో వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.

తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కెమెరా: బాలమురుగన్‌.

English summary
Radhakrishna Kumar, who earlier penned the dialogues for Gopichand's last release Sahasam, is all set to direct the actor in his directorial debut. Apparently, Radha narrated the script to Gopichand and even got the actor's nod for the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu