twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవో లేదు.. రేట్లు పెంచుకుంటాం పర్మిషన్ ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి రాధేశ్యామ్ మేకర్స్ విజ్ఞప్తి!

    |

    ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేస్తామని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు కానీ ఇప్పటికి కూడా జీవో ఎప్పుడు జారీ అవుతుంది అన్న దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఏడో తారీఖున అంటే సోమవారంనాడు జీవో జారీ అవుతుందని ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి జీవో జారీ కాలేదు. సినిమా విడుదలకు రోజుల వ్యవధి ఉండడంతో రాధేశ్యామ్ సినిమా నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    భారీ ఎత్తున

    భారీ ఎత్తున

    ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రాధేశ్యామ్. పిరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

    నిర్మాణ పనుల్లో

    నిర్మాణ పనుల్లో

    హిందీ కోసం వేరేగా మిగతా దక్షిణాది భాషల కోసం వేరేగా సంగీత దర్శకులను రంగంలోకి దింపి సినిమాకు అద్భుతమైన పాటలు అందించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు అయిన వంశీకృష్ణ, ప్రమోద్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.. అలాగే గోపి కృష్ణ మూవీస్ సినిమాని సమర్పిస్తూ ఉండడమే కాక సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ తరపున కృష్ణం రాజు కుమార్తె ప్రశీద నిర్మాణ పనుల్లో భాగమయ్యారు కూడా.

    దర్శకనిర్మాతలలో టెన్షన్

    దర్శకనిర్మాతలలో టెన్షన్

    ఎంతోకాలంగా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అద్భుతమైన విజువల్ వండర్ అందించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు మార్చి 11వ తేదీ అంటే మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవో జారీ అవుతుందా లేదా అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడున్న రేట్లతో కనక సినిమా విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్లో కచ్చితంగా సినిమాకు నష్టాలు వస్తాయని దర్శకనిర్మాతలలో టెన్షన్ నెలకొంది.

    విజ్ఞప్తి చేసి

    విజ్ఞప్తి చేసి

    ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గతంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు కలిసి జగన్ తో భేటీ అయిన సమయంలో ఇలాంటి పెద్ద సినిమాలు వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు ఎక్కువ రేట్లు టికెట్లు అమ్ముకునే విధానం పరిశీలిస్తున్నామని జగన్ స్వయంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఏదైనా కల్పించాలని వారు కోరినట్లు సమాచారం. జీవో జారీ అయితే కొత్త రేట్ల ప్రకారం ఎలాగూ అమ్ముకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు, 11వ తేదీ లోపు జీవో జారీ చేయకపోతే తాము ఇబ్బంది పడుతామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

    Recommended Video

    Radhe Shyam కి ఆ మైండ్ సెట్ తో వస్తేనే అంచానాలు అందుకుంటుంది | Prabhas | Filmibeat Telugu
    పెంచుకునే అవకాశం

    పెంచుకునే అవకాశం

    అదీగాక హీరో, హీరోయిన్, దర్శకుల రెమ్యునరేషన్ తప్పించి కేవలం నిర్మాణం కోసమే 100 కోట్లు పైగా బడ్జెట్ అయిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని జగన్ స్పష్టం చేయగా ఈ సినిమా నిర్మాణం 250 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు కాబట్టి తమకు పర్మిషన్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే తమకు పవన్ కళ్యాణ్ సినిమా అయినా నారాయణ మూర్తి సినిమా అయినా ఒక్కటేనని గతంలో కామెంట్లు చేసిన మంత్రులు ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    As per information from trusted sources Radhe Shyam makers request AP government for special prices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X