Prabhas: రాధేశ్యామ్ న్యూ పోస్టర్ రిలీజ్ అప్డేట్.. అన్ని సిద్ధమే కానీ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఆలస్యంగా అప్డేట్ ఇచ్చే ప్రొడక్షన్ టీమ్స్ లో యూవీ క్రియేషన్స్ టాప్ లో ఉంటుందని రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడో తేల్చేశారు. చాలాసార్లు నెగిటివ్ ట్యాగ్స్ ను దారుణంగా ట్రెండ్ చేశారు. మరోసారి ప్రభాస్ తో సినిమా చేయకండి అనేలా షాక్ ఇచ్చారు. అయితే యూవీ క్రియేషన్స్ కరోనా సాకుతో మరింత ఆలస్యం చేస్తోంది. దీంతో అవతల RRR టీమ్ ను చూసి నేర్చుకోండి అని కూడా అభిమానులు కసురుకుంటున్నారు.
రాధేశ్యామ్ విషయంలో యూవీ క్రియేషన్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అనుకున్నట్లుగా బజ్ అయితే క్రియేట్ చేసింది లేదు. ఆ సినిమాపై ప్రభాస్ క్రేజ్ తప్పితే మరో దారి నుంచి హైప్ క్రియేట్ అవ్వడం లేదు. ఆ మధ్య మోషన్ పోస్టర్ తో కాస్త హడావుడి చేశారు గాని అది వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ప్రభాస్ కూడా చాలాసార్లు చర్చలు జరిపినప్పటికి ఎలాంటి మార్పు రాలేదు. ఇక ప్రస్తుతం న్యూ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ప్లాన్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే యూవీ క్రియేషన్స్ లో ఇంకా ఒక భయం అయితే పోలేదు.

కరోనా థర్డ్ వేవ్ మొదలైతే పరిస్థితి ఏమిటనేది అందరిలో ఒక భయాన్ని కలిగిస్తోంది. అలాగే రిలీజ్ డేట్స్ విషయంలో మిగతా సినిమాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. రాధేశ్యామ్ సినిమాను వీలైనంత వరకు సోలోగానే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల తేదీని ఎనౌన్స్ చేయవచ్చని టాక్ వస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మరి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చిన తరువాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి. కృష్ణంరాజు కూడా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











