»   » సెక్స్ సీన్ల స్కాం: హీరోయిన్‌కు డబ్బులిచ్చి ఆమె నోరు మూయించారా?

సెక్స్ సీన్ల స్కాం: హీరోయిన్‌కు డబ్బులిచ్చి ఆమె నోరు మూయించారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రాధిక ఆప్టే 'పర్చేద్' మూవీలో చేసిన సెక్స్ సీన్లు సినిమా రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా వ్యాపించడంతో వారం రోజులుగా ఈ విషయం వెబ్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సీన్లు ఎలా లీక్ అయ్యాయో తమకు తెలియదని, ఇది మేము కావాలని చేసిన పబ్లిసిటీ స్టంట్ కాదని.... చిత్ర నిర్మాత ఆసీమ్ బజాజ్ ప్రకటించారు. అయితే ఈ నిర్మాత ప్రకటనను ఎవరూ నమ్మడం లేదు. ఇది ఉద్దేశ్య పూర్వకంగా చేసిన సెక్స్ సీన్ల స్కాంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.

'పర్చేద్' సంవత్సరం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా కేవలం ఆర్ట్ సినిమాగా తెరకెక్కించారు. గతేడాది ఫ్రాన్స్, యూఎస్ఏలలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రిలీజ్ చేసారు.

త్వరలో ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయ్యే ఆర్ట్ సినిమాలను ఇండియాలో ఆదరించే పరిస్థితి లేదు. అందుకే పక్కా ప్లానింగుతో సినిమాపై హైప్ పెంచడానికి సినిమాలోని సెక్స్ సీన్ల లీక్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

రాధిక ఆప్టే

రాధిక ఆప్టే

ఆల్రెడీ రాధిక ఆప్టే... గతంలో ఇలాంటి వ్యవహారాలతో బాగా పాపులర్ అయింది. గతంలో ఆమెకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు లీక్ అయి సంచలనం క్రియేట్ చేసాయి.

ఆమె నోరు మూయించారా?

ఆమె నోరు మూయించారా?

అయితే ‘పర్చేద్' సినిమా సీన్లు లీక్ అయిన తర్వాత మీడియా ముందుకు రావొద్దని, ఎలాంటి ప్రకటన చేయొద్దని రాధిక ఆప్టేకు సూచించారని, ఈ వ్యవహారంలో ఆమె పేరు డ్యామేజీ అవుతుంది కాబట్టి అందుకు పరిహారంగా కొంత మొత్తం చెల్లించి ఆమె నోరు మూయించారనే ప్రచారం జరుగుతోంది.

సెక్స్ సీన్ల స్కాండల్

సెక్స్ సీన్ల స్కాండల్

సినిమా రంగంలో ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ ప్లే చేయడం కొత్తేమీ కాదని, సినిమా ప్రమోషన్ కోసమే ఈ సెక్స్ సీన్ల లీక్ స్కాండల్ కు తెరలేపారని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

ఆదిల్ హుస్సేన్ ప్రవర్త అనుమానాస్పదం

ఆదిల్ హుస్సేన్ ప్రవర్త అనుమానాస్పదం

ఈ వీడియోలో రాధిక ఆప్టేతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించిన నటుడు ఆదిల్ హుస్సేన్ దీనిపై స్పందించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు.

తన పేరు పబ్లిసిటీ కావడం లేదనే ఆవేదన

తన పేరు పబ్లిసిటీ కావడం లేదనే ఆవేదన

‘ఆ వీడియో ఎలా లీకైందో తెలియదు...ఆ శృంగార సన్నివేశంలో రాధిక ఆప్టేతో పాటు నేను నటించాను. మీడియాలో దీన్ని రాధిక ఆప్టే సెక్స్ వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకని ఆదిల్ హుస్సేన్ సెక్స్ వీడియో అని పిలవడం లేదు' అంటూ ఆదిల్ హుస్సేన్ తనదైన రీతిలో స్పందించారు. ఆయన మాటల్లో తనకు పబ్లిసిటీ దక్కలేదనే ఆవేదన కనిపిస్తోందనే భావన వ్యక్తం అవుతోంది.

ఇలా కవర్ చేసాడా?

ఇలా కవర్ చేసాడా?

‘పురుషుడు ఇలాంటి వాటిలో నటించడం ఈ దేశంలో పెద్ద విశేషం కాదు...స్త్రీలు ఇలాంటి వాటిలో నటిస్తే అనవసర రాద్దాంతం చేస్తారు. ఇలాంటి సంఘటనలు మహిళల పట్ల వివక్షకు తార్కాణం. విదేశీ చిత్రాల్లో ఇలాంటి సీన్లు ఉండటం చాలా కామన్. అయితే సినిమాలో చాలా సీన్లు ఉన్నా ఈ సీనే ఎందుకు లీకైందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు' అని ఆదిల్ హుస్సేన్ అన్నారు. ఈ కామెంట్స్ లీక్ సీన్ల ఘట్టాన్ని కవర్ చేసినట్లు ఉందే తప్ప ఖండించినట్లు లేదని అంటున్నారు.

ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

లీక్ సీన్ల ఘటనపై నిర్మాత ఆసీమ్ బజాజ్ మాట్లాడుతూ.... ‘రాధిక ఆప్టే నా సోదరి లాంటిది, ఆమె సీన్లు మేమెందుకు లీక్ చేస్తాం, విదేశాల్లోనే లీక్ అయి ఉంటాయి తప్ప పబ్లిసిటీ కోసం మేము చేసిన లీక్ కాదు అన్నారు'. నిర్మాత స్పందన చాలా ఓవర్ రియాక్షన్ లా ఉందని అంటున్నారు.

అనుమానాలకు కారణం ఇదే...

అనుమానాలకు కారణం ఇదే...

సీన్లు లీక్ అయిన తర్వాత చిత్ర బృందం స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

English summary
We don't know the source of the leak, says Aseem Bajaj, producer of 'Parched', a day after clips of two intimate scenes featuring Radhika Apte went viral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu