»   »  రమ్యకృష్ణతో రాఘవేంద్రరావు...మళ్ళీ

రమ్యకృష్ణతో రాఘవేంద్రరావు...మళ్ళీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramyakrishna
కొందరని మర్చిపోవటం కష్టం. కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులూ మర్చిపోవటం కష్టమే. అలా కలకాలం గుర్తుండే అరుదైన కాంబినేషన్ వారిద్దరిది. వారే కె.రాఘవేంద్రరావుకి, ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ. వారిద్దరికి మథ్య ఉన్న అనుభంధం తెలియని వారు అరుదు. ఆమె సినీ జీవితంలో లో పెద్ద హిట్టు సినిమాలన్నీ ఆయన దర్శకత్వంలో వచ్చినవే. అలాగే ఆమె కెరీర్ లో వెనుకపడి ఐరన్ లెగ్ అని ముద్ర పడినప్పుడు 'అల్లుడుగారు' లో అద్భుతమైన పాత్ర, పాట ఇచ్చి మళ్ళీ ఆమెను బిజీగా చేసిన ఘనత ఆయనిదే. అలా వారి విజయవంతమైన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోందిట.

రాఘవేంద్రరావు ఈ మథ్య యస్.వి.ఛానెల్ వారికి పౌరాణిక సీరియల్స్ తీసిపెడుతున్నారు. వాటిల్లో లీడ్ రోల్స్ వేయటానకి తనతో చేసి మాజీలై ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లును తీసుకుంటే ఎలా గుంటుంది అనే ఆలోచన ఆయనకు వచ్చిందిట. వెంటనే అమలు పరుస్తున్నారుట. వారిని మరోసారి లైమ్ లైట్ లోకి తెచ్చినట్లు అవుతుంది..ఆలాగే తనకి పరిచయమై సింక్ అయిన వారితో నటన రాబట్టడం చాలా ఈజీ అని ఆయన అభిప్రాయపడుతున్నారట.ఆ క్రమంలో భానుప్రియ,రజని,రాధ లని సంప్రదించారట.కాని అందరూ తమ తమ వ్యాపకాల్లో బిజీగా ఉన్నారట. అప్పుడాయనకి రమ్యకృష్ణ గుర్తుకు వచ్చిందిట.ఆమె ఇప్పటికే అమ్మోరు వంటి పాత్రలలో పండిపోయింది. అందులోనూ ఈ మధ్య టి.వి.కోసం కార్యక్రమాలు కూడా రూపొందించింది. దాంతో ఆమెకి ప్రాబ్లమేలేదు. కాబట్టి ఈ మేటర్ మెటీరిలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. త్వరలోనే అఫీషయల్ గా ఎనౌన్స్ మెంట్ రావచ్చు అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X