»   » టుడే రిలీజ్: రాఘవేంద్రరావు 'ఝుమ్మంది నాదం' కధేంటి?

టుడే రిలీజ్: రాఘవేంద్రరావు 'ఝుమ్మంది నాదం' కధేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఝుమ్మంది నాదం' చిత్రం ద్వారా పరిచయం అవుతున్న తాప్సీ ఈ చిత్రంలో అమిరికాలో పుట్టిన తెలుగు అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఆమె స్టేట్స్ లో పెరిగినా సంప్రదాయ విలువలను వదలదు. అయితే ఇంకా పూర్తిగా తెలుగు సంప్రదాయాలను నేర్చుకోవాలని, అచ్చ తెలుగు అమ్మాయిగా ఉండాలని ఆమె ఇండియాకు ప్రయాణమవుతుంది. తల్లితండ్రులను ఒప్పించి ఇండియా చేరిన ఆమెకు తన తండ్రి స్నేహితుడైన మోహన్ బాబు ఆహ్వానం పలుకి తను ఇండియాలో ఉన్నంతకాలం తాను గార్డియన్ గా ఉంటాడు.ఇలా ఇక్కడ కల్చర్ పై మక్కువ పెంచుకుని దాని గొప్పతనాన్ని మరింతగా తెలుసుకుంటున్న ఆమె ఇక్కడ సంస్కృతి,సంప్రదాయలపై ఓ డాక్యుమెంటరీ తీయాలని ఆమె సంకల్పిస్తుంది. తన తల్లి తండ్రులకు దాన్ని గిప్ట్ గా ఇవ్వాలని తలపోస్తుంది. ఆ క్రమంలో ఆమెకు కలిగిన అనుభవాలేమిటి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంలా ఎదగాలనే కోరికతో సిటీ వచ్చిన మనోజ్ తో పరిచయం ఎలా అయింది..వారి ప్రేమకు పెద్దల అనుమతి లభించిందా వంటి అంసాలు తెరపై చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X